Home /News /national /

AFTER VIOLENCE IN TRACTOR RALLY ON REPUBLIC DAY TWO FARMERS UNIONS WITHDRAW PROTEST BA

Farmers Protest: ఆందోళన విరమించిన రెండు రైతు సంఘాలు..

రైతుల ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన వీఎం సింగ్ (Image; ANI)

రైతుల ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన వీఎం సింగ్ (Image; ANI)

రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని హస్తినలో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత రెండు రైతు సంఘాలు తమ నిరసనను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్ యూనియన్ రెండు సంఘాలు తాము ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి.

ఇంకా చదవండి ...
    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ 60 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల్లో రెండు సంఘాలు వెనక్కి తగ్గాయి. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని హస్తినలో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత రెండు రైతు సంఘాలు తమ నిరసనను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్ యూనియన్ రెండు సంఘాలు తాము ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి. ‘వారి ఉద్దేశం వేరుగా ఉన్న మరొకరి డైరెక్షన్‌లో మేం ముందుకు వెళ్లలేం. వారికి ఆల్ ద బెస్ట్. కానీ, వీఎం సింగ్, ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఈ నిరసన నుంచి ఇప్పుడే తప్పుకుంటోంది.’ అని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘనల్ నేషనల్ కన్వీనర్ వీఎం సింగ్ తెలిపినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. అదే సమయంలో BKU నేత రాకేష్ తికాయత్ తీరును వీఎం సింగ్ తప్పుపట్టారు. మొదట అనుకున్న మార్గంలో కాకుండా ట్రాక్టర్ ర్యాలీ దారి మళ్లించారని మండిపడ్డారు.

    దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రైతులు ముందు చెప్పిన మార్గంలో కాకుండా మరో టర్న్ తీసుకుని ఎర్రకోట వైపునకు దూసుకొచ్చారు. ఎర్రకోట వద్ద ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. అదే సమయంలో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తమ ట్రాక్టర్లతో తొక్కుకుంటూ వచ్చారు. కొన్నిచోట్ల పోలీసుల మీద కొందరు ఆందోళనకారులు పెద్ద పెద్ద కర్రలతో దాడులు చేశారు. ఈ దృశ్యాలు వెలుగులోకి కూడా వచ్చారు. సుమారు 100 మంది భద్రతా సిబ్బంది ఈ దాడుల్లో గాయపడ్డారు. ఒక రైతు ట్రాక్టర్ మీద విన్యాసాలు చేస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.

    ఇక ఆరు ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు బస్సులు ధ్వంసం అయ్యాయి. ఐదు పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు. వీటికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 70 బ్యారికేడ్లను కూడా ధ్వంసం చేశారు.

    ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ, రైతుల మధ్య 11 దఫాలు చర్చలు జరిగాయి. కానీ, ఫలప్రదం కాలేదు. ఈక్రమంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా తమ ఆందోళనను తెలిపేందుకు రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారుతుందనే ఉద్దేశంతో తొలుత కేంద్రం ఆ ర్యాలీకి అనుమతి నిరాకరించించింది. ఆ తర్వాత కోర్టులో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తాము కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడబోమని రైతులు స్పష్టం చేశారు. కానీ, హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో రెండు సంఘాలు ఆందోళన నుంచి తప్పుకొన్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Farmers Protest, New Agriculture Acts, Republic Day 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు