మరో బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు

Shiva Kumar Addula | news18india
Updated: June 6, 2018, 3:23 PM IST
మరో బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు
  • Share this:
బీజేపీ ఇంకో తలనొప్పి మొదలైంది. యూపీలో మరో బీజేపీ ఎమ్మెల్యే రేప్ కేసులో ఇరుక్కున్నాడు. ఇప్పటికే ఉన్నవ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. దాన్నిమరవక ముందే బిసోలి ఎమ్మెల్యే కుశాగ్ర సాగర్ రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి బరేలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని .. న్యాయం చేయాలని ఆశ్రయించింది.
“ మేం చాలా పేద వాళ్లం. మా నాన్న నిరుద్యోగి. మా అమ్మ గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఇళ్లలో పాచి పనులు చేసేది. అమ్మకు సాయం చేసేందుకు కొన్ని సార్లు నేను కూడా పనికి వెళ్లేదాన్ని. 2012లో నాకు 16 ఏళ్ల వయసున్నన్నప్పుడు ఒకసారి కుశాగ్ర సాగర్ ఇంటికి వెళ్లాను. ఆ క్రమంలోనే సాగర్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరం దగ్గరయ్యాం. నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని 2012 నుంచి 2014 మధ్య పలుమార్లు అత్యాచారం చేశాడు. అప్పుడు వాళ్ల నాన్నయోగేంద్ర సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. నన్ను తొలిసారి రేప్ చేసినప్పుడు.. విషయం ఆయనకు తెలిసింది. మేజర్ అయ్యాక.. మా ఇద్దరికి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశాడు. కానీ ఇప్పుడు నన్ను కాదని ... ఎమ్మెల్యేసాగర్ జూన్ 17న మరో యువతితో పెళ్లికి సిద్దమవుతున్నాడు. ఆ పెళ్లిని జరగనిచ్చే ప్రసక్తే లేదు.”అని పోలీసుల దగ్గర కన్నీరు పెట్టుకుంది బాధితురాలు.
ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ఎమ్మెల్యే 20 లక్షలు ఆఫర్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. లేకుంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు చెప్పింది. తన జీవితాన్ని కుశాగ్ర నాశనం చేశాడని.. ఎవరూ తనను పెళ్లి చేసుకోరని ఆమె వాపోయింది. కుశాగ్రతో పెళ్లి జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బాధితురాలి ఆరోపణలను ఎమ్మెల్యే కుశాగ్ర కొట్టిపారేశారు. మహిళను అడ్డంపెట్టుకొని తన రాజకీయ శత్రువులే కుట్ర పన్నారని ఆరోపించాడు. గతంలో తన తండ్రి రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని.. ఇప్పుడేమో తనను టార్గెట్ చేశారని చెబుతున్నారు. కాగా, ఎమ్మెల్యే కుశాగ్ర తండ్రి కూడా గతంలో రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడ విశేషం.
Published by: Shiva Kumar Addula
First published: May 30, 2018, 5:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading