కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కేరళలోని వాయనాడ్ లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన పార్లమెంటు సభ్యత్వాన్ని ముగించిన తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తరచూ మాట్లాడే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కూడా ఇది ఆశ్చర్యకరమైన చర్య అని అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని ఈ వ్యక్తులు రద్దు చేశారంటూ.. పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.అయితే ఆయన ప్రకటన చేసిన తరువాత.. గతంలో కళంకిత ఎంపీలు, ఎమ్మెల్యేల సభ్యత్వాలను తక్షణమే రద్దు చేయాలని బహిరంగంగా వాదించిన కేజ్రీవాల్ గతంలో చేసిన ప్రకటన కూడా బాగా వైరల్ అవుతోంది.
శుక్రవారం లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. దీనిపై అన్ని వైపుల నుంచి స్పందన కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో తన ప్రసంగంలో బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కావాలనే రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ వ్యక్తులు చాలా భయపడ్డారని ఆరోపించారు. రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించారు. దేశం చాలా క్లిష్ట దశను దాటుతోందని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ సభ్యత్వం కోల్పోయిన తర్వాత కేజ్రీవాల్ బిజెపిపై దాడి చేసి రాహుల్ గాంధీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. అయితే ఈ విషయంలో 2013లో ఆయన చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దోషులుగా తేలిన ఎంపీలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని అరవింద్ కేజ్రీవాల్ అప్పట్లో పేర్కొన్నారు. రాష్ట్రపతిని కలిసి ఆర్డినెన్స్‌పై సంతకం చేయవద్దని అభ్యర్థించారు. కళంకితులను పార్లమెంట్‌లో కూర్చోబెట్టకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని.. దానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని నిరసించారు, అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఉంది. 2023లో రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యపై మరియు పార్లమెంటు సభ్యత్వం రద్దుకు నిరసనగా కేజ్రీవాల్ భిన్నమైన ప్రకటన ఇస్తున్నారు.
Breaking News: ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. అసలు కారణం ఇదే..
Rahul Gandhi: రాహుల్ గాంధీ కథ ముగుస్తుందా ?.. నేరం రుజువైతే 2024, 2029 ఎన్నికలకు దూరమే..
రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించడం దిగ్భ్రాంతికరం అని ట్వీట్ చేశారు. దేశం చాలా క్లిష్ట దశను దాటుతోందని... దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేశాయని ఆరోపించారు. వారి అహంకార శక్తులకు వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలని కోరారు. నేడు దేశంలో జరుగుతున్నది చాలా ప్రమాదకరమైనదని... వ్యతిరేకతను తొలగించడం ద్వారా, ఈ వ్యక్తులు ఒక దేశం, ఒకే పార్టీ వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నారని ఆరోపించారు. దీనిని నియంతృత్వం అంటారని.. దేశప్రజలు ముందుకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arvind Kejriwal, Rahul Gandhi