హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఒకరి ఒళ్లో మరోకరు కూర్చుని స్టూడెంట్స్ నిరనన.. ఎందుకంటే..

ఒకరి ఒళ్లో మరోకరు కూర్చుని స్టూడెంట్స్ నిరనన.. ఎందుకంటే..

నిరసన తెలుపుతున్న విద్యార్థులు

నిరసన తెలుపుతున్న విద్యార్థులు

Kerala: కొన్ని రోజులుగా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడంపై పలువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని యువత పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

ప్రస్తుతం దాదాపు అన్ని చోట్ల అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకుంటున్నారు. కలిసి బైక్ ల మీద, బస్సుల్లో కాలేజీలకు వెళ్లడం చేస్తున్నారు. కానీ దీన్ని కొంత మంది ఇప్పటికి వ్యతిరేకిస్తున్నారు. కొందరు యువత దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో తమ పిల్లల భవిష్యత్తు పాడవుతుందిన తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ మరికొన్ని చోట్ల డెవలప్ మెంట్ అనే పేరుతో మారుతున్న సమాజానికి అనుగుణంగా యువత మారుతున్నారు. ఒకప్పటి లాగా ఇప్పుడు అమ్మాయి, అబ్బాయిలు తేడా ఉండటం లేదు.

అమ్మాయిలు అన్నిరంగాలలో రాణిస్తున్నారు. అయితే.. కొన్ని చోట్ల కట్టుబాట్లంటు వివాదాస్పందంగా ప్రవర్తిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కేరళలో (kerala) ఒక ఘటన వివాదస్పదంగా మారింది. తిరువనంతపురం దగ్గర కాలేజీ స్టూడెంట్స్ వేచి ఉండే బస్టాండ్ లో యువతి, యువకులు కూర్చోవడానికి వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. చాలా సార్లు.. అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే సీటుపై కూర్చుంటు ఇష్టమోచ్చినట్లు ప్రవర్తించారు. దీంతో ఇది గమనించిన స్థానికులు ఈ రకంగా ఏర్పాట్లు చేశారు. దీంతో విద్యార్థులు దీనిపై తీవ్ర నిరసనలు తెలిపారు.

ఈ ఘటన తిరువనంతపురంలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్-త్రివేండ్రం (సిఇటి) సమీపంలోని శ్రీకార్యం వద్ద అదే స్థలంలో జరిగింది. అయితే.. ఇక్కడ స్థానిక మేయర్.. ఆర్య ఎస్ రాజేంద్రన్ జెండర్ న్యూట్రల్ బస్టాండ్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చిన రెండు నెలల తర్వాత పౌర అధికారులు దానిని తొలగించారు. దీనిపై మేయర్ స్పందించారు. బెంచ్‌ను మూడుగా విభజించడం అనుచితమైనదన్నారు. కేరళ లాంటి ప్రగతిశీల సమాజానికి అననుకూలమైనదని కూడా అన్నారు.

ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని నాసిక్ లోని పింపాల్‌గావ్ టోల్ గేట్‌ వద్దకు ఒక కారు వచ్చింది. అయితే టోల్‌ రుసుం చెల్లింపు విషయంలో టోలో ప్లాజా ఉద్యోగినికి,కారులో ఉన్న మహిళకు మధ్య వివాదం జరిగింది. చివరకు ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు బాహాబాహికి దిగారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని తోసుకున్నారు. మరాఠీలో అసభ్యంగా తిట్టుకోవడంలోపాటు జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఇద్దరి మహిళల ఫైటింగ్‌ను తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇద్దరు మహిళలు ఒకరినొకరు పదే పదే కొట్టుకోవడం, దుర్భాషలాడుకోవడం వంటి దృశ్యాలు వైరల్ వీడియోలో క‌నిపించాయి. ఇద్దరు మహిళలలో ఒకరు మాటల వాగ్వాదం మధ్య చీరను చింపివేస్తానిని బెదిరించడం కూడా వీడియోలో కనబడుతోంది. అయితే స్పాట్ లో ఉన్న టోల్ ప్లాజా ఉద్యోగులు,పోలీసులు కొంతసేపు ఇద్దరి మహిళల గొడవను కళ్లప్పగించి చూశారు. ఆ తర్వాత జోక్యం చేసుకుని వారిద్దరిని విడదీసి పక్కకు తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Kerala, VIRAL NEWS

ఉత్తమ కథలు