ఉబెర్ డ్రైవర్ పాటకు నెటిజన్స్ ఫిదా... మెచ్చుకున్న ఉబెర్, యూట్యూబ్

ఉత్తరప్రదేశ్... లక్నోకి చెందిన ఓ ఉబెర్ డ్రైవర్... సడెన్ స్టార్ అయిపోయాడు. అతనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్‌లో హల్ చల్ చేస్తోంది. అతను పాడిన కుమార్ సానూ సాంగ్... నజర్‌ కె సామ్‌నే... వీడియో ఇంటర్నెట్‌లో బాగా షేర్ అవుతోంది. ఉబెర్, యూట్యూబ్ నుంచీ రియాక్షన్స్ అదిరిపోతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 10:10 AM IST
ఉబెర్ డ్రైవర్ పాటకు నెటిజన్స్ ఫిదా... మెచ్చుకున్న ఉబెర్, యూట్యూబ్
ఉబెర్ డ్రైవర్ పాటకు ఫిదా అవుతున్న నెటిజన్స్... (Source - Twitter )
Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 10:10 AM IST
90ల్లో నజర్ కే సామ్‌నే సాంగ్ దేశాన్ని కుదిపేసింది. ఇప్పటికీ ఆ సాంగ్ ఎవర్ గ్రీనే. తాజాగా లక్నోకి చెందిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్... ఆ పాటను పాడాడు. ఇటీవల ఒక్క సాంగ్‌తో రేణు మండల్ టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ అయినట్లే... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయాడు. ట్విట్టర్ యూజర్ గౌరవ్... సెప్టెంబర్ 14న ఓ వీడియో షేర్ చేశాడు. "లక్నోలో వినోద్ అనే ఉబెర్ డ్రైవర్‌ క్యాబ్‌లో ప్రయాణించాను. అతను పాటలు బాగా పాడతాడని తెలిసి... జర్నీ అయిపోయాక... నా కోసం ఓ పాట పాడమన్నాను. అతను పాడిన పాట ఇదీ" అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో... వినోద్... కుమార్ సాను సాంగ్... నజర్ కే సామ్‌నే...ని దింపేశాడు. అన్నట్లు వినోద్‌కి సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది.
గౌరవ్ పెట్టిన ట్వీట్‌పై ఉబెర్ ఇండియా రిప్లై ఇచ్చింది. చాలా మంది వినోద్ పాటలు బాగున్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తుంటారని తెలిపింది. ఇలాంటి ఫేమస్ డ్రైవర్ పార్ట్‌నర్‌గా ఉండటం తమకు ఎంతో గర్వకారణమన్న ఉబెర్... అతని వాయిస్ నచ్చి ఎంతో మంది పాటలు నెట్‌లో షేర్ చేస్తుంటారని తెలిపింది.
Loading...


యూట్యూబ్ ఇండియా కూడా దీనిపై స్పందించింది. వినోద్‌ని తమకు పరిచయం చేసిందందుకు థాంక్స్ చెప్పిన యూట్యూబ్ ఇండియా... న్యూ క్రియేటర్స్ తెరపైకి వస్తుండటం ఎంతో అభినందనీయమని తెలిపింది.


ఇటీవల రైల్వే స్టేషన్ దగ్గర బిక్షాటన చేసుకునే రేణు మండల్ ఇలాగే బాగా పాడుతుండటంతో... ఆమె వాయిస్ నచ్చి... మ్యూజిక్ కంపోజర్ హిమేష్ రేషమ్మియా ఆమెతో తన కొత్త సినిమాకి సంబంధించి కొన్ని పాటలు పాడించాడు. ఇప్పుడామె ఇంటర్నెట్ సెన్షేషన్ అయ్యింది. ఎంతో మంది ఆమెను అభినందనలతో ముంచెత్తారు.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...