• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • AFTER RAHUL GANDHI SONIA GANDHI APPRECIATES NITIN GADKARIS PERFORMANCE AK

కేంద్రమంత్రి గడ్కరీపై సోనియాగాంధీ పొగడ్తలు... ఏం జరుగుతోంది ?

కేంద్రమంత్రి గడ్కరీపై సోనియాగాంధీ పొగడ్తలు... ఏం జరుగుతోంది ?

నితిన్ గడ్కరీ, సోనియాగాంధీ

పార్లమెంట్‌లో గడ్కరీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న సోనియాగాంధీ చిరునవ్వులు చిందించారు. పార్లమెంట్‌లో పార్టీలకతీతంగా అనేకమంది ఎంపీలు తన పనితీరును మెచ్చుకోవడంపై గడ్కరీ సంతృప్తి వ్యక్తం చేశారు.

  • Share this:
    దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకుంటున్న చొరవ పట్ల యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సానుకూలత వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో గడ్కరీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న సోనియాగాంధీ చిరునవ్వులు చిందించారు. పార్లమెంట్‌లో పార్టీలకతీతంగా అనేకమంది ఎంపీలు తన పనితీరును మెచ్చుకోవడంపై గడ్కరీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది గమనించిన పార్టీ లోక్‌సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం బల్లలు చరిచి గడ్కరీ పనితీరును అభినందించారు.

    గత ఏడాది తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలోని సమస్యల గురించి సోనియాగాంధీ రాసిన లేఖకు నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నితిన్ గడ్కరీని దమ్మున్న నేతగా అభివర్ణించగా... తాజాగా సోనియాగాంధీ సైతం గడ్కరీ పనితీరుకు సానుకూలంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో పక్కపక్కనే కూర్చున్న నితిన్ గడ్కరీ, రాహుల్ గాంధీ... కొద్దిసేపు ముచ్చటించుకోవడం కనిపించింది. ఆ తరువాతే రాహుల్ గాంధీ గడ్కరీపై ప్రశంసలు కురిపించడం, తాజాగా సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నేతలు ఆయన పనితీరును మెచ్చుకోవడం విశేషం.
    First published:

    అగ్ర కథనాలు