మొన్న ఉల్లి, నిన్న టమాట.. నెక్ట్స్ ధరలు పెరిగే సరుకులు ఇవే..

సరుకు నిల్వల మీద ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడం, నిబంధనలు అమలు చేయడంతో ఒక్క రోజు కొంచెం ధరలు తగ్గినా...మళ్లీ యధావిధిగా పెరుగుదల నమోదవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: October 3, 2019, 5:41 PM IST
మొన్న ఉల్లి, నిన్న టమాట.. నెక్ట్స్ ధరలు పెరిగే సరుకులు ఇవే..
పెరుగుతున్న ఉల్లి, టమాట ధరలు
  • Share this:
ఉల్లి ధరలు ఇంకా తగ్గలేదు. కేజీ రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతున్నాయి. మరోవైపు టమాట ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే, ఈ ధరల మంట ఇంతటితో ఆగదు. పండుగ సీజన్‌లో పిండివంటలు వండాలనుకునే వారికి భారీ షాక్ తగలనుంది. ఉల్లి, టమాట తర్వాత పప్పు ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి. కొన్ని రోజులుగా అమాంతం పెరుగుతున్న ధరలే అందుకు సాక్ష్యం. గత వారం రోజుల్లో దేశంలోని దాదాపు అన్ని మార్కెట్లలోనే క్వింటా మినప్పప్పు ధర రూ.450 నుంచి అమాంతం పెరిగిపోయి రూ.850కి చేరింది. అది అక్కడితో ఆగే సీన్ కనిపించడం లేదు. మినప్పప్పుతో పాటు పెసరపప్పు, ఎర్రపప్పు, శనగలు రేట్లు కూడా పెరిగిపోతున్నాయి.

మధ్యప్రదేశ్‌లో ఇటీవల 40 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా కురిసిన భారీ వర్షాలతో పప్పు దినుసుల పంటలు నీట మునిగాయి. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది చాలా తక్కువ పప్పు దినుసుల దిగుబడి నమోదైంది. అయితే, సరుకు నిల్వల మీద ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడం, నిబంధనలు అమలు చేయడంతో ఒక్క రోజు కొంచెం ధరలు తగ్గినా...మళ్లీ యధావిధిగా పెరుగుదల నమోదవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముంబైలో మంగళవారం క్వింటా మినప్పప్పు ధర రూ. 5450 (గత వారంతో పోలిస్తే రూ.550 అధికం). ఢిల్లీలో రూ.450, చెన్నైలో రూ.600, కోల్‌కతాలో రూ.800 వరకు ధరలు పెరిగాయి. పెసరపప్పు కూడా వివిధ నగరాల్లో కనీసం రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగాయి.
First published: October 3, 2019, 5:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading