హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

E-pharmacies: ఇ-ఫార్మసీలపై కేంద్ర ప్రభుత్వం యూ టర్న్‌.. కారణాలు ఏంటంటే..?

E-pharmacies: ఇ-ఫార్మసీలపై కేంద్ర ప్రభుత్వం యూ టర్న్‌.. కారణాలు ఏంటంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

E-pharmacies: ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ విక్రయించేందుకు ఇ-ఫార్మసీలను ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై కేంద్రం యూ టర్న్‌ తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు న్యూస్‌18కి తెలిపాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రధాని మోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Central Government) డిజిటల్‌ ఇండియా (Digital India) కలను సాకారం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రంగాల్లో సేవలు డిజిటల్‌ విధానంలోకి మారాయి. ఇదే కోవలో ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ విక్రయించేందుకు ఇ-ఫార్మసీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై కేంద్రం యూ టర్న్‌ తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు న్యూస్‌18కి తెలిపాయి.

ఇ-ఫార్మసీల మూసివేతకు మంత్రుల బృందం(GoM) అనుకూలంగా ఉందని న్యూస్‌18కు సమాచారం అందింది. ప్రస్తుతానికి దీనిపై మరో ఆలోచనను కూడా ప్రపోజ్‌ చేయలేదు. ఫార్మసీ రంగంలో డేటా ప్రైవసీ, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు, దోపిడీ ధరలు వంటి సమస్యలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమని, రాయితీల పోటీ రిటైల్ రంగాన్ని దుర్బలంగా చేస్తుందని భావిస్తోంది. ఇ-ఫార్మసీ మెడిసిన్‌కి సంబంధించిన డేటాను సేకరిస్తుందని, చివరికి రోగి భద్రతకు సంబంధించిన ముప్పును పెంచే అవకాశం ఉందనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు.

* తుది నిర్ణయం ఏంటి?

మెడిసిన్‌ ఆన్‌లైన్ విక్రయాలను సమగ్రంగా నియంత్రించేందుకు, భారత ప్రభుత్వం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్, 1945కి సవరణ కోసం పబ్లిక్/స్టేక్‌హోల్డర్ల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించడానికి డ్రాఫ్ట్‌ రూల్స్‌ ప్రచురించింది. ఇ-ఫార్మసీ ద్వారా మెడిసిన్‌ విక్రయం, పంపిణీపై నియంత్రణకు సంబంధించిన నియమాలను చేర్చడానికి చర్యలు తీసుకుంది.

ఇది కూడా చదవండి : ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. ట్యాక్స్‌ పేయర్స్‌ ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు!

అయితే ఇ-ఫార్మసీలను పక్కనపెట్టడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇ-ఫార్మసీని నియంత్రించే కసరత్తు కొనసాగుతోందని సమాచారం. వాస్తవానికి ఫిబ్రవరిలో పార్లమెంటులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇ-ఫార్మసీలను ప్రకటించింది. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకుంటోంది.

* షోకాజ్ నోటీసులు

ఫిబ్రవరిలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ , టాటా 1MG సహా 20 కంటే ఎక్కువ ఇండియన్ ఇ-ఫార్మసీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు అందించింది. ఆన్‌లైన్‌లో డ్రగ్స్ అమ్మకానికి సంబంధించిన నిబంధనలను రూపొందించేందుకు మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని పార్లమెంట్‌కు తెలియజేసిన వారం రోజుల తర్వాత నోటీసులు జారీ అయ్యాయి.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని నిబంధనలకు, దాని కింద రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థలు నడుస్తున్నట్లు షోకాజ్ నోటీసు పేర్కొంది. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా షెడ్యూల్ H, H1, Xలో పేర్కొన్న మందులు విక్రయిస్తున్నట్లు ఆరోపించింది.

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD), ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సహా ఇతర ప్రభుత్వ సంస్థలకు అందిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. భారతదేశంలోని దాదాపు 12 లక్షల మంది ఆఫ్‌లైన్ కెమిస్ట్స్‌తో కూడిన అపెక్స్ బాడీ AIOCD. దోపిడీ ధరలతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలలో మెడిసిన్‌ అక్రమ విక్రయాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు ముందస్తు నోటీసు పంపింది.

First published:

Tags: Central Government, Medicine, National News, Pm modi

ఉత్తమ కథలు