హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Fire Pani Puri: ఫైర్ పానీపూరీ.. మంటతో పాటు నమిలి మింగేయాలి..ఇప్పుడిదే ట్రెండ్

Fire Pani Puri: ఫైర్ పానీపూరీ.. మంటతో పాటు నమిలి మింగేయాలి..ఇప్పుడిదే ట్రెండ్

ఫైర్ పానీపూరీ

ఫైర్ పానీపూరీ

Fire Pani Puri: ఫైర్ పానీ పూరీతో పాటు రగ్దా పూరీ, దహీ పూరీ, చాక్లట్ పూరీ వంటి 6 రుచుల పానీపూరీని ఇక్కడ విక్రయిస్తున్నట్లు పింటు చెప్పాడు. తమ పానీ పూరీ షాప్ ఇటీవలే ప్రారంభించానమని... ఐనప్పటికీ ప్రజల్లో మంచి స్పందన వస్తోందని పేర్కొన్నాడు.

ఇంకా చదవండి ...
  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

చాలా మందికి ఫేవరేట్ స్నాక్ ఐటమ్ పానీపూరీ (Pani puri)..! చల్లటి సాయంత్రం వేళ.. పానీపూరీ తింటే ఆ కిక్కేవేరు. ముఖ్యంగా అమ్మాయిలో చాలా మంది ఈ పానీపూరీకి ఫ్యాన్స్ ఉన్నారు. స్కూళ్లు,కాలేజీలు, ఆఫీసులు ముగిశాక.. పానీపూరీ బండి వద్దకు వెళ్లి..ప్లేట్లకు ప్లేట్స్ లాగిస్తుంటారు. ఐతే వీరిని ఆకట్టుకునేలా ఇప్పుడు మరో కొత్త వెరైటీ పానీపూరీ వచ్చేసింది. అదే ఫైర్ పానీపూరీ (Fire panipuri). ఫైర్ పాన్‌లాగే.. దీనిని కూడా మండుతున్నప్పుడే తినాలి. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ ఫైర్ పానీపూరీ ట్రెండింగ్‌లో ఉంది. బైరియా చౌక్ నుంచి పహార్‌పూర్‌కు వెళ్లే రహదారిలో స్టేట్ బ్యాంక్ ముందు ప్రతి సాయంత్రం ఫైర్ పానీ పూరీ బండి అందుబాటులో ఉంటుది.

పింటూ కుమార్ అనే యువకుడు ఈ ఫైర్‌ పానీపూరీ బండిని నడుపుతున్నాడు. దీని తయారీ కూడా సాధారణ పానీపూరీలాగానే ఉంటుంది. గోల్‌గప్పలో బాదం, కిస్మిస్, కొబ్బరి తురుము, సోంపు, పాన్ మసాలా వంటివి వేస్తారు. దాదాపు పది పదిహేను పదార్థాలను కలుపుతారు. ఆ తర్వాత దానిపై కర్పూరం ఉంచుతారు. ఇది పూజలో వాడేది కాదు. తినే కర్పూరం. లడ్డూల తయారీలో కూడా వాడుతుంటారు. ఆ కర్పూరాన్ని ఉంచి.. వెలిగిస్తారు. అది మండుతండగానే నోట్లో వేసుకోవాలి. ఫైర్ పానీపూరీ టేస్ట్ చాలా బాగుందని.. నోట్లో వేసుకున్నా కాలలేదని కస్టమర్లు చెబుతున్నారు. ఇలాంటి పానీపూరీ ముజఫర్ వాసులకు కొత్త అని.. రోజురోజుకూ దీనికి క్రేజ్ పెరుగుతోందని పేర్కొన్నారు.

అహ్మదాబాద్‌లో రెండేళ్ల పాటు పనిచేశానని.. అక్కడే తాను ఫైర్ పానీ పూరీని తయారీని నేర్చుకున్నానని పింటూ చెప్పారు. తర్వాత ముజఫర్‌పూర్‌లో కూడా సొంత దుకాణం ఎందుకు పెట్టకూడదని అనుకున్నాడు. ఈ ఆలోచనతోనే పింటు ముజఫర్‌పూర్‌కు చేరుకుని.. ఇక్కడ ఫైర్ పానీ పూరీ దుకాణాన్ని తెరిచాడు. పింటు షాపులో ఒక్క ఫైర్ పానీపూరీ రూ.10కి లభిస్తోంది. ప్లేట్‌కు నాలుగు ఇస్తారు. ధర 40 రూపాయలు. ఈ వెరైటీ పానీపూరీకి జనాల నుంచి మంది స్పందన వస్తోంది. ఒక్కసారి తినండి.. మళ్లీ మళ్లీ రండి.. అనేది పింటూ షాప్ ట్యాగ్ లైన్..! అందుకు తగ్గట్టుగానే.. ఒక్కసారి టేస్ట్ చేసిన వారు..మళ్లీ మళ్లీ వస్తున్నారు.

ఫైర్ పానీ పూరీతో పాటు రగ్దా పూరీ, దహీ పూరీ, చాక్లట్ పూరీ వంటి 6 రుచుల పానీపూరీని ఇక్కడ విక్రయిస్తున్నట్లు పింటు చెప్పాడు. తమ పానీ పూరీ షాప్ ఇటీవలే ప్రారంభించానమని... ఐనప్పటికీ ప్రజల్లో మంచి స్పందన వస్తోందని పేర్కొన్నాడు. ఇక్కడ ఫైర్ పానీపూరీ లభిస్తుందని తెలిసి.. దానిని టేస్ట్ చేసేందుకు చాలా మంది వస్తున్నారు. ఫైర్ పానీపూరీ తింటున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

First published:

Tags: Bihar, Pani Puri

ఉత్తమ కథలు