బండినే కాదు... కుటుంబాన్నీ నడిపిస్తున్న యువతి

ఓ అమ్మాయి రోడ్డుపై నిర్భయంగా నడవడమే కష్టమని భావించే సమాజంలో... కాంచన డ్రైవర్‌గా మారడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. షాకిచ్చింది. ఆమెను వద్దని చుట్టుపక్కలవాళ్లు వారించారు. అయినా ఎవరి మాటా వినలేదు కాంచన. ఇప్పుడు రోడ్డుపై వాహనాన్ని నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాంచన డ్రైవింగ్ ద్వారా సంపాదించే మొత్తమే ఆ కుటుంబ పోషణకు సరిపోతోంది.

news18-telugu
Updated: October 30, 2018, 1:39 PM IST
బండినే కాదు... కుటుంబాన్నీ నడిపిస్తున్న యువతి
వాహనాన్ని నడిపిస్తున్న కాంచన
  • Share this:
బేటీ బచావో... బేటీ పఢావో... ఇదీ కేంద్ర ప్రభుత్వ నినాదం. కొడుకు ఉంటేనే కుటుంబానికి అండగా ఉంటాడన్న సమాజం ఆలోచనల్లో ఇంకా మార్పు కనిపించట్లేదు. కూతురు కూడా ఏ విషయంలోనూ తక్కువకాదని నిరూపిస్తున్న అమ్మాయిలు ఎందరో ఉన్నారు. ఈ కాంచన కూడా అంతే. బీహార్‌లోని ఓ కుగ్రామానికి చెందిన కాంచన తండ్రి డ్రైవర్. కానీ ఓ ప్రమాదంలో గాయాలపాలై ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబం గడవడం కష్టంగా మారింది. అప్పుడే కాంచన బండి తాళం చెవులు తీసుకుంది. తనూ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టింది.

బండినే కాదు... కుటుంబాన్నీ నడిపిస్తున్న యువతి!, After father met with accident, Daughter became driver to earn money for family
తల్లిదండ్రులతో కాంచన


ఆరుగురు అక్కాచెల్లెళ్లలో కాంచన పెద్దమ్మాయి. ఓ అమ్మాయి రోడ్డుపై నిర్భయంగా నడవడమే కష్టమని భావించే సమాజంలో... కాంచన డ్రైవర్‌గా మారడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. షాకిచ్చింది. ఆమెను వద్దని చుట్టుపక్కలవాళ్లు వారించారు. అయినా ఎవరి మాటా వినలేదు కాంచన. ఇప్పుడు రోడ్డుపై వాహనాన్ని నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాంచన డ్రైవింగ్ ద్వారా సంపాదించే మొత్తమే ఆ కుటుంబ పోషణకు సరిపోతోంది.

బండినే కాదు... కుటుంబాన్నీ నడిపిస్తున్న యువతి!, After father met with accident, Daughter became driver to earn money for family
వాహనాన్ని నడిపిస్తున్న కాంచన


ఇప్పుడా అమ్మాయిని చూసి కుటుంబమే కాదు... గ్రామస్తులూ గర్వపడుతున్నారు. మొదట్లో ఆమెను వ్యతిరేకించినవాళ్లు సైతం సలాం చేస్తున్నారు. ఏదైనా ధైర్యంగా చేయాలని సంకల్పిస్తే... ఎలాంటి అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్లొచ్చని నిరూపిస్తోంది కాంచన. అంతేకాదు... కొడుకుకూ, కూతురుకు మధ్య తేడా ఏం లేదని చాటిచెబుతోంది.

ఇవి కూడా చదవండి:వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి...

లవ్... సెక్స్... దోఖా: వివాహేతర సంబంధం ఎలా బయటపడింది?

నేతాజీ మరణ వార్తను బ్రిటీష్ ప్రభుత్వం ఎందుకు నమ్మలేదు?

మీ బడ్జెట్‌లో ఈ 5 మార్పులు కనిపించాయా? అప్పులపాలవుతున్నట్టే...

ఐటీ నోటీస్ వచ్చిందా? ఏం చేయాలో తెలుసా?

ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్: తగ్గిన ఏటీఎం విత్‌డ్రా లిమిట్
Published by: Santhosh Kumar S
First published: October 30, 2018, 1:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading