హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కేజ్రీవాల్ ను డిన్నర్ కు పిలిచిన ఆటో డ్రైవర్.. మొదటి నుంచి నాకు బీజేపీ అంటేనే ఇష్టం..

కేజ్రీవాల్ ను డిన్నర్ కు పిలిచిన ఆటో డ్రైవర్.. మొదటి నుంచి నాకు బీజేపీ అంటేనే ఇష్టం..

ఆటో డ్రైవర్ విక్రమ్ దంతాని

ఆటో డ్రైవర్ విక్రమ్ దంతాని

Gujarat:  గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఒక ఆటోడ్రైవర్ ను తన ఇంటికి భోజనానికి పిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, అతను మరోసారి వార్తలలో నిలిచాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొలది అనేక పార్టీలు ప్రచారాం కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీపార్టీ గుజరాత్ లో పాగావేయాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా అపోసిషన్ పార్టీలను ఎండగడుతునే ఉంది. ఇప్పటికే అనేక పార్టీలు బహిరంగ సమావేశాలు, ర్యాలీలతో ప్రజలకు తాము అందించబోయే పథకాలను వివరిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఉండగా విక్రమ్ దంతాని అనే ఆటో డ్రైవర్ కేజ్రీవాల్ బహిరంగ సమావేశంలో పాల్గొన్నాడు. అప్పుడు.. తన ఇంటికి విందు భోజనానికి రావాల్సిందిగా సీఎంను కోరాడు. అతని కోరిక తీర్చడానికి కేజ్రీవాల్, విక్రమ్ ఇంటికి వెళ్లి అందరిని షాకింగ్ కు గురిచేశారు.

అప్పట్లో ఒక సీఎం ఆమ్ ఆద్మీ ఇంటికి భోజనానికి వెళ్లడం సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి విక్రమ్ దంతాని వార్తలలో నిలిచాడు. కాగా, ప్రధాని మోదీ గుజరాత్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో విక్రమ్ దంతాని బీజేపీ కండువా ధరించి జోష్ గా సభలో పాల్గొన్నాడు. దీనిపై అతడిని మీడియాప్రశ్నించగా.. ‘ నాకు మొదటి నుంచి బీజేపీ అంటేనే ఇష్టమని, మోదీనే తాను ఫాలో అవుతానని చెప్పాడు. ’. గతంలో కేవలం మా ఆటో యూనియన్ నాయకులు చెప్పడం వలన కేజ్రీవాల్ ను భోజనానికి పిలిచానని చెప్పుకొచ్చాడు.

కేజ్రీవాల్ విందు తర్వాత.. ఆప్ నాయకులతో నేను టచ్ లో లేనని చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి బీజీపీకి పరమ భక్తుడినని చెప్పుకొచ్చాడు. గతంతలో కూడా తాను బీజేపీకే ఓటువేశానని, భవిష్యత్తులో కూడా బీజేపీకి తన మద్దతుంటుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఘటన వార్తలలో నిలిచింది.

ఇదిలా ఉండగా జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఊరట కలిగించే పరిణామం చోటు చేసుకుంది.

పార్టీ శ్రేణులకు భిన్నమైన స్వరం వినిపిస్తున్న జి-23 నాయకులు ఇప్పుడు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేకు కూడా మద్దతు ఇస్తున్నారు. వీరిలో ఒకరైన మనీష్ తివారీ శుక్రవారం కాంగ్రెస్ (Congress) కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఖర్గే అభ్యర్థిత్వంపై ఆయన మాట్లాడారు. మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కాంగ్రెస్ సీనియర్ నాయకుడని.. తాను, ఆనంద్ శర్మ ఆయన నామినేషన్‌కు మద్దతు ఇవ్వడానికి ఇక్కడకు వచ్చామని అన్నారు. మనీష్ తివారీ, శశి థరూర్ ఇద్దరూ G-23 గ్రూప్‌కు చెందినవారే. అందుకే స్వయంగా మనీష్ తివారీ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి (Congress President Elections) పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖర్గే నామినేషన్‌కు మద్దతిస్తున్నామని మనీష్ తివారీ తెలిపారు.

శశి థరూర్ గతంలో కూడా మంచి స్నేహితుడని.. ఇప్పటికీ, ఎప్పటికీ కూడా మంచి స్నేహితుడే అని అన్నారు. కాంగ్రెస్‌లో తమ జీవితాలను గడిపిన వారు ఇక్కడ ఉన్నారని పేర్కొన్నారు. నాయకత్వం, స్పష్టమైన భావజాలం, పారదర్శకత రాజకీయ పార్టీకి ఆధారమని మనీష్ తివారీ ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Aravind Kejriwal, Bjp, Gujarat, VIRAL NEWS

ఉత్తమ కథలు