సాధారణంగా రాజకీయ నేతలు.. ఒకసారి పాదయాత్ర లాంటిది మొదలుపెడితే.. అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికలు వచ్చేవరకూ దాన్ని కొనసాగిస్తారు. తద్వారా ప్రజల నోళ్లలో తమ పార్టీ పేరు నానేలా చేస్తారు. మరి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఇప్పుడే భారత్ జోడో యాత్రను ముగించేశారు. కేంద్రంలో ఎన్నికలు రావడానికి ఇంకా సంవత్సరానికి పైగా టైమ్ ఉంది. భారత్ జోడో యాత్రతో వచ్చిన ప్రజా స్పందనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకపోతే... ఒకట్రెండు నెలల్లోనే ఆ వేడి చల్లారిపోతుంది. ఫలితంగా యాత్ర వల్ల ప్రయోజనం రాదనే అభిప్రాయం ఉంది.
రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం వెతుకుతూ ఉంది. ఆ పరిస్థితుల్లో తన యాత్ర.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కాదనీ.. దేశ సమైక్యత కోసమే అని రాహుల్ తెలిపారు. కానీ ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం అధికారాన్ని చేపట్టడమే అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం చూస్తే.. రాహుల్ పాదయాత్ర అంతిమ ఉద్దేశం కూడా అదే అవుతుంది.
लाल चौक पर तिरंगा लहराकर भारत से किया वादा आज पूरा हुआ।???????? नफ़रत हारेगी, मोहब्बत हमेशा जीतेगी, भारत में उम्मीदों का नया सवेरा होगा। pic.twitter.com/8B6vAk3aL6
— Rahul Gandhi (@RahulGandhi) January 29, 2023
సెప్టెంబరు 7, 2022న కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించిన రాహుల్.. 134 రోజులు.. 4,084 కిలోమీటర్లు నడిచి... కాశ్మీర్ చేరారు. తమిళనాడు , కేరళ , కర్ణాటక , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ (కొద్దిగా), మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతోపాటూ.. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ఇవాళ శ్రీనగర్‌లోని షేర్-ఎ-కాశ్మీర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా కోరడంతో.. ప్రతిపక్ష నేతలు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
भारत जोड़ो यात्रा मेरी जिंदगी का सबसे सुंदर और गहरा अनुभव है। यह अंत नहीं है, पहला कदम है, यह एक शुरुआत है! pic.twitter.com/XcImeAsVDu
— Rahul Gandhi (@RahulGandhi) January 29, 2023
ఈ సభ తర్వాత రాహుల్ గాంధీ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్‌కి దక్కిన మైలేజీ మళ్లీ చెదిరిపోయే అవకాశం ఉంది. ఈ వేడిని ఇలాగే కంటిన్యూ చెయ్యాలంటే.. రాహుల్... భారత్ జోడో యాత్ర రెండో విడత మొదలుపెట్టాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మొదటి విడతలో టచ్ చెయ్యని రాష్ట్రాలను రెండో విడతలో పర్యటించాలని కోరుతున్నారు. దీనిపై రాహుల్ నిర్ణయం ఏంటన్నది ఆయనే చెప్పాలి.
ఇది కూడా చదవండి : Budget 2023 : రేపు పార్లమెంట్ ప్రారంభం.. 1న బడ్జెట్ .. కీ పాయింట్స్
ఈ యాత్రతో పార్టీ సంగతి ఎలా ఉన్నా రాహుల్ మాత్రం కోట్ల మందిని కలిశారు. గడ్డం పెంచి.. యోగిలా మారారు. ఇదివరకూ ఎప్పుడూ లేని కొత్తదనం ఆయనలో కనిపిస్తోంది. అలాగే ఆయన మాట తీరు, ప్రభుత్వంపై చేసే విమర్శల్లోనూ వేడి పెరిగింది. చాలా సందర్భాల్లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు రాహుల్ స్ట్రైట్‌గా సమాధానాలు ఇచ్చారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకూ బూస్ట్ ఇస్తాయన్నది మున్ముందు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Jodo Yatra, Rahul Gandhi