AFTER CJI GOGOI JUSTICE SIKRI RECUSES FROM PLEA AGAINST NAGESWARA RAO AS INTERIM CBI CHIEF
సీబీఐ వివాదం...విచారణ బెంచ్ నుంచి వైదొలగిన మరో జడ్జి
జస్టిస్ ఏకే సిక్రి
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావును నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేస్తున్న బెంచ్ నుంచి ఇప్పటికే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వైదొలగగా...తామాకే ఆయన బాటలోనే మరో జడ్జి సిక్రి తప్పుకున్నారు.
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వర రావును నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న బెంచ్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏకే సిక్రి తనకు తానుగా వైదొలిగారు. ఈ కేసు విచారణను ఏకే సిక్రి నేతృత్వంలోని బెంచ్ మరో బెంచ్‌కి బదిలీ చేసింది. ఇప్పటికే ఈ పిటిషన్‌పై విచాణ బెంచ్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ తప్పుకోవడం తెలిసిందే.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ సిక్రి
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావును నియమించడాన్ని రద్దు చేస్తూ రూలింగ్ ఇవ్వాలని కోరుతూ ‘కామన్ కాస్’ అనే ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గురువారంనాడు ఈ కేసు విచారణకు వచ్చిన వెంటనే ఈ పిటిషన్‌పై విచారణ జరిపే బెంచ్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు జస్టిస్ సిక్రి...కామన్ కాస్ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేకి తెలిపారు. ‘మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోండి...ఈ పిటిషన్‌ను నేను విచారించలేను’ అని వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ మరో బెంచ్ ఎదుట శుక్రవారం విచారణకు రానుంది. అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించిన ఉన్నతస్థాయి ప్యానల్లో సిక్రీ కూడా సభ్యుడిగా ఉన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.