AFTER CBI ED BOOKS KARTI CHIDAMBARAM ON CHARGES OF MONEY LAUNDERING IN CHINESE VISAS CASE PVN
Chinese visas case : చైనీయులకు వీసాల్లో అక్రమాలు..చిదంబరం మెడకు మరో ఉచ్చు
కార్తి చిదంబరం(Photo:PTI)
Karti Chidambaram in Chinese visas case : మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది. చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు పంజాబ్లో పవర్ ప్లాంటు నిర్మిస్తున్న వేదాంత గ్రూపు కంపెనీ తల్వాండి సాబో పవర్ లిమిటెడ్ లో పనిచేసేందుకు నిబంధనలను ఉల్లంఘిస్తూ 263 మంది చైనా జాతీయులకు వీసాలు పొందడంలో సహాయం చేశారనే ఆరోపణలున్నాయి.
Karti Chidambaram in Chinese visas case : మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది. చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు పంజాబ్లో పవర్ ప్లాంటు నిర్మిస్తున్న వేదాంత గ్రూపు కంపెనీ తల్వాండి సాబో పవర్ లిమిటెడ్ లో పనిచేసేందుకు నిబంధనలను ఉల్లంఘిస్తూ 263 మంది చైనా జాతీయులకు వీసాలు పొందడంలో సహాయం చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే కార్తీ, ఆయన సన్నిహితుడు భాస్కరరామన్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ కూడా కేసు పెట్టినట్లు సదరు సంస్థ వర్గాలు బుధవారం తెలిపాయి.
సుమారు రూ. 50 లక్షలు తీసుకుని.. చైనాకు చెందిన 250 మందికి కార్తీ చిదంబరం వీసాలు ఇప్పించారన్నది ప్రధాన ఆరోపణ. చైనా సంస్థలోని 263 ప్రాజెక్ట్ వీసాలను గడువు ముగిసినా మళ్లీ ఉపయోగించుకునేలా చేశారు. సాధారణంగా వీసాను పునర్వినియోగించుకోవాలంటే హోంమంత్రి అనుమతి అవసరం. అప్పటి హోంమంత్రి వీటిని అనుమతించినట్లు తెలుస్తోంది. అప్పటి హోంమంత్రి చిదంబరంతో చర్చించి రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు అని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
చిదంబరం సన్నిహితుడు, ఈ కేసుతో సంబంధం ఉన్న భాస్కర రామన్ను గత వారం అదుపులోకి తీసుకుంది. మరోవైపు, ఈ వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరాన్ని సీబీఐ విచారించనుంది. విచారణలో పాల్గొనాల్సిందిగా గతంలో కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే, బుధవారం ఉదయం కార్తీ చిదంబరం తరపు న్యాయవాది సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారని అధికారులు తెలిపారు. న్యాయవాదిని విచారించాల్సిన అవసరం లేదని... కార్తీ చిదంబరమే స్వయంగా రావాలని చెప్పి పంపినట్లు వెల్లడించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.