చైనీస్ సోషల్ మీడియా 'వీబో' నుంచి తప్పుకున్న ప్రధాని మోదీ

వీబోలో ఇప్పటి వరకు 115 పోస్ట్‌లు చేశారు ప్రధాని. ఐతే అందులో 113 పోస్టులను ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పటికే డిలీట్ చేసింది. మరో రెండు పోస్ట్‌లు మాత్రం మిగిలిఉన్నాయి.

news18-telugu
Updated: July 1, 2020, 6:45 PM IST
చైనీస్ సోషల్ మీడియా 'వీబో' నుంచి తప్పుకున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ
  • Share this:
చైనీస్ సోషల్ మీడియా దిగ్గజం వీబో నుంచి ఆయన తప్పుకున్నారు. వీబోలో తన ఖాతాను డీ యాక్టివేట్ చేశారు. టిక్‌టాక్, హలో, వీబో సహా చైనాకు చెందిన 59 యాప్స్‌ను భారత్ నిషేధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన వెంటనే ఆయన వీబో ఖాతాను డీయాక్టివేట్ చేశారని వెల్లడించాయి. ప్రధాని మోదీది వెరిఫైడ్ అకౌంట్ అయినందున.. యూజర్ పాలిసీ దృష్ట్యా ఆ ఖాతాను వీబో తొలగించడం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీయే వీబో అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు.


ప్రధాని మోదీ 2015, మే 4న వీబోలో ప్రధాని మోదీ అకౌంట్ క్రియేట్ అయింది. చైనా పర్యటన సందర్భంలో వీబోలో చేరారు. వీబోలో ప్రధాని మోదీకి 2.4 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. వీబోలో ఇప్పటి వరకు 115 పోస్ట్‌లు చేశారు ప్రధాని. ఐతే అందులో 113 పోస్టులను ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పటికే డిలీట్ చేసింది. మరో రెండు పోస్ట్‌లు మాత్రం మిగిలిఉన్నాయి. అందులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫొటోలను మోదీ పోస్ట్ చేయడంతో.. వాటిని తొలగించడం కష్టమైంది. వీబోలో చైనా అధ్యక్షుడు ఫొటోలు ఉన్న ఫొటోలను డిలీట్ చేయడం సాధ్యం కాదు. ఈ కారణం వల్లే ప్రధాని మోదీ వీబో ఖాతాల్లో ఆ రెండు పోస్టులు అలాగే ఉండిపోయాయి.

కాగా, టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ అప్లికేషన్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. విస్తృత డిజిటల్ మార్కెట్‌గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. చైనా యాప్స్‌తో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుందని ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిని దుర్వినియోగం చేస్తూ, డౌటా చౌర్యంతో పాటు విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చైనీస్ యాప్స్‌ను దేశంలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
First published: July 1, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading