ఢిల్లీలో 11 గంటలుగా ధర్నా చేసిన పోలీసులు తమ పోరాటాన్ని ముగించారు. పైఅధికారుల భరోసాతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద తమ నిరసనకు ముగింపు పలికారు. ఢిల్లీలో సోమవారం, శనివారం రోజు కోర్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద న్యాయవాదులు దాడి చేశారు. పోలీసులు, న్యాయవాదుల మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఇది పెనుబీభత్సానికి దారితీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలు కొట్టుకుని వాహనాలు కూడా తగలబెట్టుకున్నారు. ఈ దాడిలో 20 మంది పోలీసులకు, పలువురు న్యాయవాదులకు కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో న్యాయవాదులు రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. అయితే, తమ మీద దాడి చేసిన లాయర్ల మీద కేసులు పెట్టాలంటూ పోలీసులు ఇవాళ సడన్‌గా ధర్నా చేశారు. అయితే, వారికి పైఅధికారులు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు.
ఢిల్లీలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ బయట ధర్నా చేస్తున్న పోలీసులకు పైఅధికారులు భరోసా ఇచ్చారు. అందరూ ధర్నాను విరమించి విధుల్లో చేరాలని స్పెషల్ కమిషనర్ సతీష్ గోల్చా విజ్ఞప్తి చేశారు. తీస్ హజారే కోర్టు వద్ద న్యాయవాదులతో జరిగిన గొడవలో గాయపడిన పోలీసులకు 25వేలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. ధర్నా చేస్తున్న వారి మీద శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు. కోర్టు వద్ద జరిగిన గొడవకు సంబంధించి కచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పారు.
సమస్యను పరిష్కరిస్తారా? పెట్రోల్‌తో రమ్మంటారా?.. ఓ రైతు ఆగ్రహం
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.