Delhi high court : హిందువును ఎట్లా పూడ్చిపెడతారు.. ? సౌదీ నుండి పూడ్చిన శవాన్ని తెప్పించుకున్న భార్య

హిందువును ఎట్లా పూడ్చిపెడతారు.. ? సౌదీ నుండి పూడ్చిన శవాన్ని తెప్పించుకున్న భార్య

హిందు సంప్రదాయాలకు వ్యతిరేకంగా తన భర్తకు దహన సంస్కరాలు నిర్వహించారంటూ.. న్యాయపోరాటం చేసిన ఓ భార్య, 100 రోజుల తర్వాత సౌదీలో పూడ్చిన భర్త మృతదేహాన్ని తెచ్చుకుంది.

  • Share this:
విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ చనిపోయిన వారి మృత దేహాలు తీసుకురావమనేది పెద్ద ప్రహసనమే, డబ్బు పలుకుబడితోపాటు విదేశీ చట్టలకు అనుగుణంగా ఫాలో అవుతు తమ కుటుంభ సభ్యులను తీసుకు రావడం అనేది చాలా కష్టతరమై విషయం.

విదేశాల్లో మృత దేహాలను తీసుకురావడంపై తమిళ్, తెలుగులో కొన్ని సినిమాలు కూడ వచ్చాయంటే..విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఓ సినిమా మొత్తం చనిపోయిన తన భర్త మృతదేహాన్ని అరేబియన్ కంట్రీస్‌ నుండి తీసుకు రావడం చుట్టే తిరగుతుంది. ఇందులో సంకల్పం ఉంటే ఏదైనా ఎంతటి కష్టతరమైన చేయవచ్చనే సందేశాన్ని ఆ సినిమా ఇస్తుంది.

అచ్చు ఇలాంటీ సంఘటనే నిజ జీవితంలో వెలుగులోకి వచ్చింది. కొద్ది సంవత్సరాలుగా సౌది అరేబియాలో పనిచేస్తూ చనిపోయిన భర్త మృతదేహాన్ని, అది కూడ శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత వంద రోజులకు ఇండియాకు తీసుకువచ్చింది ఓ భార్య. అది కూడ తమ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా శవాన్ని పూడ్చిపెట్టారని కోర్టుకు వెళ్లి విజయం సాధించింది.

వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సంజీవ్ కుమార్ గత 23 సంవత్సరాలుగా సౌదీలో పనిచేస్తున్నాడు. అయితే సంజీవ్‌కుమార్‌కు జనవరి 24న గుండేపోటు రావడంతో అక్కడి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే చికిత్స సమయంలోనే ఆయన మృత్యువాత పడ్డారు. దీంతో ఆయన శవాన్ని తన కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిన కంపనీ చెతులెత్తడంతో స్థానిక పోలీసులు ముస్లిం సంప్రదాయాల ప్రకారం మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. కాని సంజీవ్ కుమార్ ఒక హిందువు, అయినా అక్కడి ఎమిరేట్స్ లో పని చేస్తున్న ట్రాన్స్‌లేటర్ సంజీవ్ కుమార్ హిందువు అని కాకుండా ముస్లిం అని పేర్కోన్నారు. దీంతో ఆయన్ను అక్కడే పూడ్చి వేశారు.

అయితే దీనిపై సంజీవ్ కుమార్ భార్య అంజుశర్మ న్యాయపోరాటం చేశారు. ఇందుకోసం తెలంగాణకు చెందిన ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం సహకారంతో ఢిల్లి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో కేసును పరీశీలించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ కుమార్ మృతదేహాన్ని ఆయన భార్యకు అప్పగించాలని తీర్పు వెలువరించారు.దీంతో సౌది ప్రభుత్వం సంజీవ్ కుమార్ శవాన్ని కార్గో విమానంలో బుధవారం ఢిల్లీకి తరలించారు.ఎయిర్‌పోర్టులో అంజుశర్మకు విదేశాంగశాఖ అధికారులు అప్పగించారు.
Published by:yveerash yveerash
First published: