హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మోదీ సర్కార్ మరో సంచలనం : MSP(కనీస మద్దతు ధర) చట్టంపై కదలిక -10 నెలల తర్వాత రైతులతో చర్చలు

మోదీ సర్కార్ మరో సంచలనం : MSP(కనీస మద్దతు ధర) చట్టంపై కదలిక -10 నెలల తర్వాత రైతులతో చర్చలు

రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్

రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్

10 నెలల తర్వాత సంప్రదింపుల ప్రక్రియ పున:ప్రారంభం కానుంది. వివాదాస్పద సాగు చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం.. రైతుల ప్రధాన డిమాండ్ అయిన ‘కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టం’పై మాట్లాడటానికి అంగీకరించింది. ఎంఎస్‌పీ చట్టం రూపకల్పనపై రైతుల వాదన వినేందుకు, అదే సమయంలో ప్రభుత్వ ఆలోచన వివరించే దిశగా కేంద్రం వడివడి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..

ఇంకా చదవండి ...

రైతుల విషయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సాగు చట్టాలు రద్దు చేసినా ఉద్యమాన్ని కొనసాగిస్తోన్న రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమైంది. రైతులు-కేంద్రం మధ్య చివరిగా జనవరి రెండో వారంలో చర్చలు జరిగాయి. రిపబ్లిక్ డే(జనవరి 26)నాటి ట్రాక్టర్ల ర్యాలీలో హింస చెలరేగిన తర్వాత  చర్చలు నిలిచిపోగా, మళ్లీ ఇప్పుడు 10 నెలల తర్వాత సంప్రదింపుల ప్రక్రియ పున:ప్రారంభం కానుంది. వివాదాస్పద సాగు చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం.. రైతుల ప్రధాన డిమాండ్ అయిన ‘కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టం’పై మాట్లాడటానికి అంగీకరించింది. ఎంఎస్‌పీ చట్టం రూపకల్పనపై రైతుల వాదన వినేందుకు, అదే సమయంలో ప్రభుత్వ ఆలోచన వివరించే దిశగా కేంద్రం వడివడి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..

వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కిందట నిరసనోద్యమాన్ని ప్రారంభించిన రైతులు.. మొత్తం ఆరు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. సాగు చట్టాల రద్దుతోపాటు అన్ని పంటలకు కనీస మద్దతు ధర దక్కేలా ఎంఎస్‌పీ చట్టం రూపకల్పన, కొత్త విద్యుత్ చట్టం ఉపసంహరణ తదితర కీలక డిమాండ్లున్నాయి. కాబట్టే సాగు చట్టాల రద్దు తర్వాత కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. మొత్తం 40 రైతు సంఘాలు ఒకే గొడుకు కిందకొచ్చి ఏర్పాటైన సంయుక్త్ కిసాన్ మోర్ఛా(ఎస్కేఎం) ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నది. అలాంటి ఎస్కేయూ నేతలతో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామంటూ కేంద్రం మంగళవారం నాడు కీలక సందేశం పంపింది.

రోజూ మధ్యాహ్నం కోడలిని అలా చూస్తూ తట్టుకోలేక అత్తమామల అకృత్యం -అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారుకనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వివాదంపై మాట్లాడేందుకు ఐదుగురు ప్రతినిధుల పేర్లు సూచించాలంటూ సంయుక్త్ కిసాన్ మోర్ఛాకు కేంద్రం ఇవాళ సమాచారం పంపింది. ఎంఎస్‌పీపై నవంబర్ 30లోగా ఏదో ఒక నిర్ణయం చెప్పకుంటే డిసెంబర్ నెలలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్న కిసాన్ మోర్ఛా హెచ్చరిక నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు చర్చల ప్రక్రియకు తొలి అడుగు వేసింది. ప్రతినిధులను సూచించాలంటూ కేంద్రం ఇవాళ పంపిన సందేశంతో.. దాదాపు 10 నెలల తర్వాత చర్చల ప్రక్రియ పున:ప్రారంభం అయినట్లయింది.

Omicron : ఒమిక్రాన్ దెబ్బకు వ్యాక్సినేషన్‌లో భారీ మార్పు! -మోదీ సర్కార్ ఏం చేయబోతోందటే..పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లును ఉభయ సభల్లో ఆమోదించింది అధికార పక్షం. అయితే కనీస చర్చకు తావు లేకుండా హుటాహుటిన బిల్లును పాస్ చేయించుకున్న తీరుపై విపక్షాలతోపాటు రైతు సంఘాల సమాఖ్య ఎస్కేఎం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఎంఎస్‌పీ వివాదంపై చర్చలకు ఐదుగరిని పంపాలన్న కేంద్రం సందేశంపై ఎస్కేయూ ప్రతిస్పందించాల్సి ఉంది.

Published by:Madhu Kota
First published:

Tags: Centre government, Farmers, Farmers Protest, MSP, Parliament Winter session