AFSPA AREAS REDUCED DISTURBED AREAS UNDER AFSPA IN ASSAM NAGALAND MANIPUR REDUCED SAYS AMIT SHAH MKS
AFSPA: మాట నిటెట్టుకున్న మోదీ సర్కార్.. సాయుధ దళాల ప్రత్యేక చట్టం పరిధి కుదింపు: Amit Shah
అమిత్ షా, నరేంద్ర మోదీ
ఈశాన్యంలో ఎన్నో నెత్తుటిమరకలకు కారణమైన సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని ఈ దశలవారీగా తొలగిస్తామని మోదీ సర్కార్ హామీ ఇచ్చిన క్రమంలో దాని అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
సొంత పౌరులనే కాల్చి చంపినా దాన్ని నేరంగా పరిగణించే వీలు లేని సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) తొలి నుంచీ వివాదాస్పదంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కఠినంగా అమలయ్యే ఈ చట్టం బారినపడి ఎంతోమంది అమాయకులు బలైపోయారు. అలాంటి చట్టాన్ని తొలగించాలంటూ ఈశాన్య రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇరోం షర్మిల అయితే ఏకంగా 20ఏళ్లపాటు ఆమరణనిరాహార దీక్ష చేశారు. ఈశాన్యంలో ఎన్నో నెత్తుటిమరకలకు కారణమైన సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని ఈ దశలవారీగా తొలగిస్తామని మోదీ సర్కార్ హామీ ఇచ్చిన క్రమంలో దాని అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో సాయుధ బలగాల చట్టం పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కుదిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. ‘ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం కిందికి వచ్చే ప్రాంతాలను తగ్గించాలని నిర్ణించాం’ అని అమిత్‌షా ట్వీట్ చేశారు.
మూడు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి తమ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని, శాంతి కోసం, ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిందని, అనేక ఒప్పందాలు కూడా చేసుకుందని అమిత్ షా పేర్కొన్నారు. విరామం లేకుండా మోదీ సర్కారు చేస్తోన్న కృషి వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నాయని షా వ్యాఖ్యానించారు.
సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం పరిధిని కుదించిన సందర్భంగా మూడు రాష్ట్రాల ప్రజలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా ఈశాన్యంలో అమలవుతోన్న ఏఎఫ్‌ఎస్‌పీఏకు అమాయకులు ఎందరో బలైపోయిన ఉదంతాలున్నాయి. గతేడాది డిసెంబర్లో నాగాలాండ్ ఎన్నికల సందర్భంలో మోన్ జిల్లాలో ఉగ్రవాదులు అని భ్రమపడి ఆర్మీ కాల్పులు జరపగా, 14 మంది అమాయకులు బలయ్యారు.
1958లో ఈ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తీసుకొచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో, అల్లరు చోటుచేసుకునే ప్రాంతాల్లో పబ్లిక్ ఆర్డర్‌ను నిర్వహించడానికి సాయుధ బలగాలకు ఈ చట్టం ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని హెచ్చరించిన తర్వాత అతనిపై బలవంతంగా కాల్పులు జరపడానికి కూడా ఇది అనుమతిస్తుంది. వారెంట్ లేకుండా ప్రవేశించడానికి, శోధించడానికి, నేరానికి పాల్పడిన ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తుంది. ఈ చర్యలన్నింటినీ చేసే సాయుధ బలగాలకు ప్రాసిక్యూట్ నుంచి మినహాయింపు లభిస్తుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.