హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

AFS : మరో కొత్త ప్రాణాంతక వైరస్..అసోంలో కేసు నమోదు..పందులని చంపేస్తున్న ప్రభుత్వాలు

AFS : మరో కొత్త ప్రాణాంతక వైరస్..అసోంలో కేసు నమోదు..పందులని చంపేస్తున్న ప్రభుత్వాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

African Swine Fever :  రెండేళ్ల క్రితం చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్..ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. మనదేశంలో కూడా గత కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం మళ్లీ ప్రపంచంపై మంకీపాక్స్ విరుచుకుపడింది.

ఇంకా చదవండి ...

African Swine Fever :  రెండేళ్ల క్రితం చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్..ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. మనదేశంలో కూడా గత కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం మళ్లీ ప్రపంచంపై మంకీపాక్స్ విరుచుకుపడింది. ఇటీవల భారత్ లోని కేరళ రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ కేసు నిర్థారణ అయింది. అయితే ఉన్న ఈ వైరస్ లతో ప్రజలు అల్లాడుతుంటే ఇప్పుడు మరో వైరస్ టెన్షన్ పెడుతుంది. అసోంలో(Assam)ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్(ASF)కేసుని గుర్తించిన‌ట్టు అధికారులు తెలిపారు. దిబ్రూఘర్‌ జిల్లాలోని భోగాలి పత్తర్ గ్రామంలోని ఓ పందికి ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్(African Swine Fever)పాజిటివ్ గా తేలిందని అధికారులు తెలిపారు. దిబ్రూఘర్‌లోని భోగాలి పత్తర్ గ్రామంలో ఒక రైతు పంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండగా దానిని పరీక్షించి, శాంపిల్ ను టెస్ట్ కోసం పంపారు. పరీక్షలో పందికి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉందని నిర్ధారించబడింది.

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పందుల‌కు సోకే అంటువ్యాధి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మానవులకు సోకదు లేదా వ్యాపించదు.ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పందులలో జ్వరం, వికారం, విరేచనాలను కలిగిస్తుంది. ఇది పందులకు ప్రాణాంతకం, అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధి. ఇది హెమరేజిక్ వైరల్ వ్యాధి. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఎపిక్‌సెంట‌ర్ ప‌రిధిలోని అన్ని పందుల‌ను చంపేస్తున్నామ‌ని తెలిపారు. దిబ్రూఘర్ పశుసంవర్ధక, పశువైద్య అధికారి డాక్టర్ హిమాందు బికాష్ బారువా మీడియాతో మాట్లాడుతూ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మొదటి కేసు నమోదైన ప్రాంతంలో 1 కి.మీ పరిధిలో ఉన్న అన్ని పందులను చంపి పాతిపెట్టినట్లు తెలిపారు. మొత్తం ప్రాంతాన్ని కూడా శానిటైజ్ చేసినట్లు చెప్పారు.

Shocking : బాలికపై ఫ్యాక్టరీ మేనేజర్ అత్యాచారం..నోట్లో యాసిడ్ పోసి మరీ..

ఇటీవల, ఉత్తరాఖండ్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసు నమోదు అయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక వారం పాటు పంది మాంసం తినకుండా ఉండాలని స్థానికులను కోరింది. గత వారం రోజులుగా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా డెహ్రాడూన్, కోట్‌ద్వార్, చమోలి,ముని కి రేటి (తెహ్రీ గర్వాల్ జిల్లాలో) వంటి నగరాల్లో సుమారు 200 పందుల మరణాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈశాన్య భార‌తంలోని అనేక రాష్ట్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ను గుర్తించిన‌ట్టు రిపోర్టులు అందుతున్నాయి. అసోం, మిజోరాం, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, అలాగే ఉత్తరాఖండ్, బీహార్‌లలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF) కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్‌ను గుర్తించిన తర్వాత మిజోరం ప్రభుత్వం 37,000 కంటే ఎక్కువ పందులను చంపింది. బీహార్‌ లోని పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పందులు, పంది మాంసం, దాని ఉత్పత్తులు, పందుల ఎరువు రవాణాపై 30 రోజుల నిషేధం విధించింది. ఈ నిషేధం జూలై 14 నుంచి 30 రోజుల పాటు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో పందుల జనాభాను రక్షించడానికి ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. పందులు, పందుల మాంసం, పందుల మాంసం ఉత్పత్తులు, పందుల పేడను రోడ్డు,జల,వాయు మార్గంలో కేరళకు తరలించడం, దిగుమతి చేసుకోవడంపై ఒక నెల పాటు నిషేధం విధిస్తూ పినరయి విజయన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

First published:

Tags: Assam, Virus

ఉత్తమ కథలు