తాలిబన్ల ఆఫర్... ముగ్గురు భారతీయుల్ని వదిలేశారు

అయితే ఇందుకు అమెరికన్ అధికారులు కూడా అంగీకరించినట్లు సమాచారం. దీనిపై ఇంతవరకు భారత్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

advertorial
Updated: October 7, 2019, 4:31 PM IST
తాలిబన్ల ఆఫర్... ముగ్గురు భారతీయుల్ని వదిలేశారు
ప్రతీకాత్మక చిత్రం
  • Advertorial
  • Last Updated: October 7, 2019, 4:31 PM IST
  • Share this:
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల చెరలో ఉన్న ముగ్గురు భారతీయ ఇంజినీర్ల విడుదలకు తాలిబన్లు ఒప్పుకున్నారు. గతేడాదిలో అపహరించిన ముగ్గురు ఇండియన్ ఇంజినీర్లను విడుదల చేశారు.అయితే ఇందుకు ఓ కండిషన్ పెట్టారు. మేం ఆ ముగ్గుర్ని వదిలియాలంటే అందుకు బదులుగా అమెరికా జైల్లో ఉన్న 11 తాలిబన్లను వదిలేయాలని నిబంధన పెట్టారు.ఆదివారం తాలిబన్ ప్రతినిధులు, అమెరికా బలగాల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అయితే ఇందుకు అమెరికన్ అధికారులు కూడా అంగీకరించారు. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు భారత్, ఆఫ్ఘాన్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు ఈ ముగ్గురు ఇంజినీర్ల రిలీజ్‌కు బదులుగా కోసం 11 మంది తాలిబన్లను అమెరికా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అమెరికా విడుదల చేయబోతున్న వారిలో తాలిబన్ ముఖ్య నేతలు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రముఖ తాలిబన్ నేతలు అబ్దుల్ రహీమ్‌తో పాటు... మౌలాన్ అబ్దుర్ రషీద్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ 2001 లో అమెరికా నేతృత్వంలోని పరిపాలనకు ముందు తాలిబాన్ పరిపాలనలో వరుసగా కునార్ మరియు నిమ్రోజ్ ప్రావిన్సుల గవర్నర్లుగా పనిచేశారు.

2018 మే నెలలో అప్ఘాన్ బగ్లాన్ ప్రావిన్స్‌లో పనిచేస్తున్న ఏడుగురు ఇంజినీర్లను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. వీరిలో ఒకరిని గత మార్చిలో విడుదల చేశారు. మిగిలిన ముగ్గురు భారతీయ ఇంజినీర్లు ఇప్పటికీ తాలిబన్ల చెరలోనే ఉన్నారు. తాజాగా వీరితో పాటు, ఆస్ట్రేలియాకు చెందిన మరో ఇద్దరిని కూడా విడిచిపెట్టేందుకు తాలిబన్లు అంగీకరించారు. కిడ్నాప్‌కు గురైన వారంతా బగ్లాన్ ప్రావిన్స్‌లోని కేఈసీ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నవారే.

First published: October 7, 2019, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading