ADVOCATE PARTICIPATES IN SEX WHILE VIRTUAL ARGUMENTS IN THE COURT IN CHENNAI HIGH COURT VRY
Viral news : కోర్టు వాదనల్లోనే లాయర్ రాసలీలలు ..వర్చువల్‌గా బుక్ అయిన మేధావి...
ప్రతీకాత్మక చిత్రం
Viral news : కోర్టువాదనల్లో ఉన్న ఓ అడ్వకేట్.. రాసలీలల్లో మునిగిపోయాడు.. వాదనలు జరుగుతుండగానే... తనముందున్న కెమేరా ఆఫ్ చేయకుండానే... కామ కోరికలను తీర్చుకున్నాడు..దీంతో ఉన్న వీడియోను వాదనల్లో ఉన్న జడ్జీలతో పాటు ఇతర లాయర్లు గురుడి రాసలీలకు షాక్‌య్యారు.
కరోనా తర్వాత ప్రపంచమంతా వర్చువల్‌గా మారింది. స్కూళ్లో విద్య నుండి ప్రభుత్వంలో జరిగే ప్రతి కార్యక్రమం వర్చువల్‌గానే కొనసాగుతోంది. అయితే విధానంపై చాలా మందికి అవగాహన లేకపోవడం, చాలా మంది తమ ముందు ఉన్న కెమేరాలను ఆన్ చేసి వారి పని వారు చేసుకుంటూ పోవడం..తో వ్యక్తిగత అంశాలు సైతం బహిరంగమవుతున్నాయి. ఇలా మామూలు విషయాలు అయితే పర్వాలేదు.. ఏకంగా కొత్తమంది కనీస అవగాహనతో పాటు అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ నుండి ఉన్నత సమావేశాల వరకు అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమావేశాల్లో ఉండగానే కొంతమంది రాసలీలల్లో మునిగిపోతున్నారు. ఇలా వారి వీడియో పబ్లిక్‌లోకి రావడంతో వైరల్‌గా మారుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. సోమవారం చెన్నై హైకోర్టులో ఓ కేసుకు సంబంధించి వర్చువల్‌గా వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ఆర్డీ సంతాన కృష్ణన్ అనే న్యాయవాది కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. కేసు వాదనలను అవతలి వైపు లాయర్లు వినిపిస్తున్నారు. అప్పటికే కెమేరా ఆన్ చేసి ఉంది. అది గమనించని ఆ అడ్వకేట్ ఓ వాదనలు జరుగుతుంటే.. మరోవైపు ఓ మహిళతో రాసలీలల్లో మునిగిపోయాడు.ఇక ఇదంతా గమనిస్తున్న న్యాయమూర్తి సీరియస్ అయ్యాడు.
ఇంకేముంది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వైరల్‌గా మారడం ఓకే .. ఆ రాసలీలల్లో పాల్గొన్న అడ్వకేట్‌పై న్యాయమూర్తి సీరియస్ అయ్యాడు. దీంతో ఇది కోర్టు దిక్కారణ కేసుగా హైకోర్టు సమోటాగా స్వీకరించింది. ఇద్దరు సభ్యులు గల బెంచ్ కేసును విచారణ చేపట్టి ఐటి చట్టాల ప్రకారం స్థానిక సిబిసిఐడి పోలీసులకు అప్పగించారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు న్యాయవాది సంతాన కృష్ణన్ పై వేటు వేసింది. రాష్ట్రంలోని ఏ కోర్టులో వాదించకుండా నిషేధం విధించాలని బార్కౌన్సిల్నుకు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇక వైరల్‌గా మారిన ఆ వీడియోను సైతం ఇంటర్నెట్ నుండి తొలగించాలని చెన్నై పోలీసు కమీషనర్‌ను ఆదేశించింది.
మరోవైపు ఇంకో కేసులో కూడా మాజీ రిటైర్డ్ ఐపిఎస్‌కు కూడా వార్నింగ్ ఇచ్చింది. వర్చువల్ గా ఆ అధికారి పడుకుని ఉన్నట్టు కనిపించడంతో ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటీ సంఘటనలు పునారావృతం కాకుండా ఉండాలని హెచ్చరించారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.