Video: ప్రతీ ఓటు ఎందుకు ముఖ్యం? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది

మన మంచి భవిష్యత్తును నిర్ణయించేది మన ఓటే. దేశ భవిష్యత్తు కోసం సరైన మార్గంలో తొలి అడుగు వేసేలా స్ఫూర్తిని రగిలించే వీడియో ఇది.

news18-telugu
Updated: April 20, 2019, 7:34 PM IST
Video: ప్రతీ ఓటు ఎందుకు ముఖ్యం? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 20, 2019, 7:34 PM IST
ఇది ఎన్నికల సీజన్. ప్రభుత్వం ఆ ఉత్సాహాన్ని దేశంలోని గ్రామగ్రామానికి తీసుకెళ్తోంది. ఓవైపు ఇంత ఉత్సాహం కనిపిస్తున్నా కొందరు మాత్రం పోలింగ్ బూత్‌కు వెళ్లకుండా ఏవేవో సాకులు, కారణాలు చెబుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాగే చెప్పారు. నాడు 84.3 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉంటే వారిలో 66% మంది మాత్రమే ఓటు వేశారు. అంటే మిగతా 34% మంది ఓటు వేయలేదు. ఓటు వేసిన 66% మంది మాత్రమే దేశ భవిష్యత్తును నిర్ణయించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో 90 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈసారి జరిగే ఎన్నికలు అతిపెద్దవి. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే గతంలో లాగా 66 శాతం మాత్రమే కాకుండా ఈసారి తొలిసారి ఓటు వేస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఓటింగ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఓటింగ్ శాతం కొంత పెరిగితే సరిపోదు. ఓటు వేయడానికి ప్రజలు 100% నిబద్ధతతో లేనప్పుడు, ప్రభుత్వం నుంచి దేశానికి 100% నిబద్ధత ఎలా కోరుకుంటాం.

అందుకే ప్రతీ ఓటు కీలకం. ప్రతీ ఓటు విలువైనదే. ప్రతీ ఓటు ఫలితాన్ని నిర్దేశించేదే. భిన్నత్వంలోనే ఏకత్వం ఉంది. మన మంచి భవిష్యత్తును నిర్ణయించేది మన ఓటే. దేశ భవిష్యత్తు కోసం సరైన మార్గంలో తొలి అడుగు వేసేలా స్ఫూర్తిని రగిలించే వీడియో ఇది.





దేశంలో ప్రతీ ఒక్కరు కలిసివచ్చి, స్వంత భవిష్యత్తు, ఇతరుల భవిష్యత్తు మాత్రమే కాదు దేశ బంగారు భవిష్యత్తు కోసం ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు నెట్‌వర్క్ 18, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం ఇది.
#AajSawaaroApnaKal
First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...