అయ్యో పాపం.. రోడ్ల మీద పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న నటుడు

బాలీవుడ్ చిత్రం ‘డ్రీమ్ గర్ల్’లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సోలంకి దివాకర్.. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ఢిల్లీలో రోడ్లపై మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: May 27, 2020, 6:13 AM IST
అయ్యో పాపం.. రోడ్ల మీద పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న నటుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. వీధుల్లో బిచ్చమెత్తుకునే వారి దగ్గరి నుంచి ప్రముఖ బడా వ్యాపార వేత్తల వరకు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే. ఈ వైరస్ ధాటికి అనేక రంగాలు కుంటుపడ్డాయి. ప్రధానంగా వైరస్ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ నిబంధనల వల్ల ఉపాధి కోల్పోయి ఎంతోమంది రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ నిలిచిపోవడం వల్ల సినీ నటులకూ ఇబ్బందులు తప్పడం లేదు. అయితే తాజాగా ఓ నటుడు సైతం ఢిల్లీ వీధుల్లో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండడం సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యంలో పడేసింది. బాలీవుడ్ చిత్రం ‘డ్రీమ్ గర్ల్’లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సోలంకి దివాకర్.. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ఢిల్లీలో రోడ్లపై మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఢిల్లీలోని శ్రీనివాసపురి ప్రాంతంలో ఉంటున్న ఆయన.. మాలవీయ నగర్, లజ్‌పత్ నగర్‌లో బండిపై మామిడి పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీనిపై నటుడు సోలంకి దివాకర్ స్పందిస్తూ.. నేను సినిమాల్లో నటించి బాగా డబ్బు సంపాదిస్తే.. ఇప్పుడిలా పండ్లు అమ్ముకునేవాడిని కాదన్నారు.
First published: May 27, 2020, 6:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading