హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Actor Siddharth - Saina: సైనా నెహ్వాల్‌పై వ్యాఖ్య‌లు స‌రికాదు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

Actor Siddharth - Saina: సైనా నెహ్వాల్‌పై వ్యాఖ్య‌లు స‌రికాదు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

కిరణ్ రిజిజు (ఫోటో - ట్విట్ట‌ర్‌)

కిరణ్ రిజిజు (ఫోటో - ట్విట్ట‌ర్‌)

Actor Siddharth - Saina | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ దుమారం రేపుతోంది. సిద్ధార్థ్ సైనాపై వివాదాస్ప‌దంగా ట్వీట్ చేశారు. దీంతో సిద్ధార్థపై ఏకంగా జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తాజాగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు.

ఇంకా చదవండి ...

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal) పై హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ దుమారం రేపుతోంది.  సిద్ధార్థ్ సైనాపై వివాదాస్ప‌దంగా ట్వీట్ చేశారు. దీంతో సిద్ధార్థపై ఏకంగా జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సిద్ధార్థ ట్విట్టర్ ఖాతాను వెంటనే డిలీట్​ చేయాలని ట్విట్టర్​ ఇండియాకు లేఖ రాసింది. సైనా నెహ్వాల్​పై అతడు అభ్యంతర కామెంట్స్ చేశాడని..ఈ కేసులో మహారాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. తాజాగా బ్యా డ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌ల‌పై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు. దేశానికే గర్వకారణమైన క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై చేసిన వ్యా ఖ్యలు చేసిన వారి సంకుచిత మనస్తత్వా న్ని తెలియజేస్తున్నాయని అన్నారు.

Work From Home: వారంలో కేసులు పెరిగే అవ‌కాశం ప్రైవేటు ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం.. ఆదేశాలిచ్చిన ప్ర‌భుత్వం


నవరి 5న పంజాబ్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కొందరు నిరసనవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. రోడ్డుకు అడ్డంగా భారీ కేడ్లతో నిరసన వ్యక్తం చేయడంతో ప్రధానమంత్రి భద్రత దృష్ట్యా, ప్రధాని కాన్వాయ్‌ని పర్యటనను రద్దు చేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘ‌ట‌న‌పై సైనా నెహ్వాల్ స్పందించింది.

" ప్రధానిపైనే దాడి జరిగితే, ఆ దేశంలో భద్రత ఉందని ఎలా చెప్పగలం. భారత ప్రధాని మోదీపై జరిగిన ఈ దుర్మార్గమైన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. " అంటూ ట్వీట్ చేసింది భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్. ఈ ట్వీట్‌పై న‌టుడు సిద్ధార్థ్ వివాద‌స్ప‌దంగా ట్వీట్ చేశారు. షటిల్ స్టార్ సైనా నెహ్వాల్ ట్వీట్‌కి హీరో సిద్ధార్థ్ స్పందించాడు. " అతిచిన్న కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. దేవుడా.. భారతదేశాన్ని రక్షించేవాళ్లు కూడా ఉన్నారు.. షేమ్ ఆన్ యూ రిహానా.." అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. హీరో సిద్ధార్థ్ వేసిన ట్వీట్లకు నెటిజన్ల నుంచి తీవ్రమైన స్పందన వస్తోంది.

Assembly Elections 2022: అప్పుడు లెక్క‌లేని పార్టీ.. ఇప్పుడు లెక్క‌లు మారుస్తోంది.. ర‌స‌వ‌త్త‌రంగా పంజాబ్ రాజ‌కీయం!


ఎకౌంట్‌లో బ్లాక్ చేయాల‌ని లేఖ‌..

ఈ వ్య వహారాన్ని సుమోటోగా స్వీ కరిం చిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ ).. సిద్ధార్థ్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్విట్ట‌ర్‌కు, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖలు రాసింది.  ముఖ్యం గా సిద్ధార్థ్ వాడిన పదాలు అభ్యం తరకరంగా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు మొదలయ్యా యి. వీటిపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, గాయని చిన్మయి శ్రీపాద తోపాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు కూడా ఆయనపై ఆగ్రహం వ్య క్తం చేశారు.

First published:

Tags: Hero siddarth, India, Pm modi, Punjab, Saina Nehwal