పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఆందోళనల్లో రాజకీయల పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులతో పాటు సినీ నటులు సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గురువారం చెన్నైలో జరిగిన CAA వ్యతిరేక ప్రదర్శనకు సీని హీరో సిద్దార్థ్ హాజరయ్యారు. వల్లువార్కొటాంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సిద్దార్థ్‌తో పాటు మ్యుజిషియన్ టీఎమ్ క్రిష్ణ పాల్గొన్నారు.
ఐతే ఎలాంటి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా గుమికూడినందుకు ఆందోళనల్లో పాల్గొన్న వారందరిపైనా శుక్రవారం పోలీసులు కేసులు నమోదు చేశారు. సిద్దార్థ్‌తో పాటు 600 మందిపై IPC 143, సెక్షన్ 41 క్లాస్ 6 కింద కేసు పెట్టారు. కేసు నమోదైన వారిలో లోక్‌సభ ఎంపీ థోల్ తిరుమావలావన్, మాజీ ఎమ్మెల్యే ఎంహెచ్ జవహిరుల్లా కూడా ఉన్నారు. చట్టం ప్రకారం వారికి గరిష్టంగా ఆరు నెలల జైలుశిక్ష లేదంటే జరిమానా విధిస్తారు. రెండూ కూడా విధించే అవకాశముంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.