మద్యం దుకాణాలు తెరవడంపై రజనీ ఫైర్.. తమిళనాడు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు..

కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు తిరిగి తెరిస్తే.. మీరు మళ్లీ అధికారంలోకి రావాలనే కలను మరచిపోవాలని రజనీ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నాడు. దీనికి నటుడు కమల్ హాసన్, డీఎంకే చీప్ ఎంకే స్టాలిన్ వంటి వారు రజనీకి మద్దతుగా నిలిచారు.

news18-telugu
Updated: May 10, 2020, 4:22 PM IST
మద్యం దుకాణాలు తెరవడంపై రజనీ ఫైర్.. తమిళనాడు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు..
రజినీకాంత్ (Rajinikanth)
  • Share this:
మద్యం దుకాణాలు తెరవడంపై ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తమిళనాడు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు తిరిగి తెరిస్తే.. మీరు మళ్లీ అధికారంలోకి రావాలనే కలను మరచిపోవాలని రజనీ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నాడు. దీనికి నటుడు కమల్ హాసన్, డీఎంకే చీప్ ఎంకే స్టాలిన్ వంటి వారు రజనీకి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ ఖజానాను నింపేందుకు మంచి మార్గాలను వెతుక్కోవాలి తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోవొద్దని రజనీ విమర్శించాడు. రజనీ కామెంట్స్‌పై నెటిజన్లు పలురకాలుగా స్పందించారు. ఇదిలావుంటే.. తమిళనాడు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసివేయాలని, డోర్ డెలివరీ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సూచించింది. కానీ ప్రభుత్వం డోర్ డెలివరీ సాధ్యం కాదని, ఆదాయం పడిపోతుందని, సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చింది.
First published: May 10, 2020, 4:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading