ACTOR PRATIK GANDHI SAYS HE WAS HUMILIATED BY POLICE DURING PM NARENDRA MODI VISIT IN MUMBAI PVN
Pratik Gandhi : మోదీ రాకతో ఆ ప్రముఖ నటుడికి కష్టాలు..పాపం నడుచుకుంటూనే షూటింగ్ లొకేషన్ కి
ప్రతీక్ గాంధీ(ఫైల్ ఫొటో)
Pratik Gandhi Waks To Sets : దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన స్కామ్ 1992 సిరీస్ లో..ఒక్కప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ ను తన కనుసన్నల్లో నడిపించి వేల కోట్లు కొల్లగొట్టిన హర్షద్ మొహతా పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలదుకున్నాడు బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ.
Pratik Gandhi Waks To Sets : దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన స్కామ్ 1992 సిరీస్ లో..ఒక్కప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ ను తన కనుసన్నల్లో నడిపించి వేల కోట్లు కొల్లగొట్టిన హర్షద్ మొహతా పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలదుకున్నాడు బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ. ఈ సిరీస్ తో బాలీవుడ్ లో అతడికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. అయితే తాజాగా స్కామ్ 1992 హీరో ప్రతీక్ గాంధీ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో ప్రతీక్ ముంబై పోలీసులు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రాకతో ఆదివారం ముంబైలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంలో షూటింగ్ లొకేషన్ కు చేరుకోవడానికి ఇబ్బందులు పడాల్సివచ్చిందని ప్రతీక్ గాంధీ(Pratik Gandhi) ట్వీట్ చేశాడు. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నాడు. ప్రతీక్ గాంధీ చేసిన ట్వీట్ లో.."ముంబై డబ్ల్యూఈహెచ్ వద్ద వీఐపీ మూవ్మెంట్ కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య చోటు చేసుకుంది. నేను షూటింగ్ లొకేషన్ కి చేరుకోవడానికి రోడ్డుపై నడుస్తుండగా… పోలీసులు నన్ను భుజం పట్టుకుని, కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే ఏదో మార్బుల్ గోడౌన్ లోకి నెట్టారు #అవమానం" అని పేర్కొన్నారు.
Mumbai WEH is jammed coz of “VIP” movement, I started walking on the roads to reach the shoot location and Police caught me by shoulder and almost pushed me in some random marble warehouse to wait till without any discussion. #humiliated
ప్రతీక్ గాంధీ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ ముంబై నగర శివారు ప్రాంతంలో జరుగుతుందట. వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే మార్గం ద్వారా కారులో షూటింగ్ లొకేషన్ కు వెళ్లాలని ప్రతీక్ అనుకున్నాడట. కానీ మోదీ తో పాటు వీఐపీల రాకతో హైవే పై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పాడు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో షూటింగ్ లొకేషన్ కు నడుచుకుంటూనే వెళ్లానని అన్నాడు. తనతో పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని ఈ ట్వీట్ లో అతడు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆదివారం లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును స్వీకరించిన తొలి గ్రహీత నరేంద్రమోదీ కావడం గమనార్హం. అవార్డును స్వీకరించేందుకు ఆదివారం నరేంద్ర మోదీ ముంబై రావడంలో పోలీసులు ట్రాఫిక్ అంక్షలను విధించారు. చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.ముంబైలోని కీలకమైన వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే (డబ్ల్యూఈహెచ్)పై ప్రజల రాకపోకలకు అడ్డుకట్ట పడింది. కాగా,ప్రతీక్ గాంధీ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ప్రతీక్ గాంధీ సినిమాల విషయానికొస్తే… ఫూలే చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినియాలో ప్రతీక్ "జ్యోతిబా ఫూలే"గా, పత్రలేఖ "సావిత్రి ఫూలే"గా నటిస్తున్నారు. మరోవైపు, విద్యాబాలన్, ఇలియానాలతో కలిసి ప్రతీక్ గాంధీ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అంతేకాకుండా మొన్నామధ్య ఏపీ సీఎం జగన్ బయోపిక్ లో కూడా ప్రతీక్ నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.