హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

‘కండోమ్ ఫ్రీ వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణి..’.. సీరియస్ అయిన సీఎం..

‘కండోమ్ ఫ్రీ వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణి..’.. సీరియస్ అయిన సీఎం..

సీఎం నితిష్ కుమార్, మహిళ ఐఏఎస్ హర్జోత్ కౌర్ బమ్రా (ఫైల్)

సీఎం నితిష్ కుమార్, మహిళ ఐఏఎస్ హర్జోత్ కౌర్ బమ్రా (ఫైల్)

Bihar: బాలికలతో జరిగిన సమావేశంలో ఐఏఎస్ అధికారిణి ప్రభుత్వం నుంచి అందే పథకాల గురించి చర్చ జరిగింది. ఈక్రమంలో ఐఏఎస్ అధికారిని చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారంగా మారాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

బీహార్ లోని (Bihar) పాట్నాలో ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (డబ్ల్యూడిసి) మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌరక్ బమ్రాహ్ (HARJOT KAUR BHAMRA)  చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఈ ఘటన వైరల్ గా మారడంతో దీనిపై సీఎం  కూడా స్పందించారు. ఈ రోజు బీహార్ సీఎం నితీష్ కుమార్ (nitish kumar) గురువారం మాట్లాడుతూ.. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించామని తెలిపారు. దీనిపై రాజకీయ దుమారం తలెత్తంది.

ఈ క్రమంలో.. లిఖిత పూర్వక వివరణకు ఆదేశించినట్లు సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే దీన్ని విచారించడానికి మహిళా అధికారిణిలతో కూడిన ప్యానెల్ ను కూడా ఏర్పాటు చేసినట్లు నితీష్ కుమార్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మహిళ సాధికరత కోసం పనిచేస్తోందని అన్నారు. కాగా, మహిళ ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ బమ్రా యూనిసెఫ్ లో ఆధ్వర్యంలో పాట్నాలో జరిగిన వర్క్ షాప్ లో బాలికతో జరిగిన సంభాషణలో ప్రభుత్వం తక్కువ ధరకే న్యాప్ కిన్ లు ఇవ్వచ్చుకదా అని ప్రశ్నించింది. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. బూట్లు, ప్యాంటు, రేపు కండోమ్ కూడా ఫ్రీగానే అడుగుతారా.. అంటే వేటకారంగా వ్యాఖ్యలు చేశారు.

బీహార్ లోని పాట్నాలో అమ్మాయిల పట్ల వివక్షతను రూపుమాపడం అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనిలో స్థానిక మహిళ కలెక్టర్ హర్జోత్ కౌర్ భమ్రా (IAS officer Harjot Kaur Bhamra) పాల్గొన్నారు. దీనిలో ఆమె కొందరు విద్యార్థులతో పాఠశాలలోని సమస్యలు ఏవైన ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈనేపథ్యంలో ఒక యువతి.. తమ పాఠశాలలో మరుగు దొడ్డి సమస్యగాఉందని, డోర్ లు సరిగ్గా లేవని చెప్పింది. తమ పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ తో చెప్పింది. దీనిపై కలెక్టర్ మీ ఇంట్లో ఎన్ని మరుగు దొడ్డులు ఉన్నాయనిబాలికను ప్రశ్నించారు. అంతే కాకుండా.. ప్రభుత్వం విద్యార్థినులకు 20,30 శానిటరీ ప్యాడ్ లను ఇవ్వగలదా అని ప్రశ్నించింది.

దీనిపై కలెక్టర్ కాస్త వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రేపు మీకు జీన్స్ ప్యాంట్ ఇస్తుంది.. ఆ తర్వాత బూట్లు, ఇలా ప్రతి ఒక్కటి ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుందని కలెక్టర్ హర్జోత్ కౌర్ భమ్రా చురకలంటించారు. అంతే కాకుండా చివరకు కుటుంబ నియంత్రణ కోసం కండోమ్ కూడా ప్రభుత్వమే ఇస్తుందని కూడా విద్యార్థినితో అన్నారు. దీనికి విద్యార్థిని.. ప్రజలు ఓట్లు వేయడం వలన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పింది. దీనికి కలెక్టర్ మరీ.. పాకిస్థాన్ మాదిరిగా ఓట్లు వేయకండని వ్యాఖ్యలు చేసింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, VIRAL NEWS

ఉత్తమ కథలు