సీతని అపహరించింది రావణుడు కాదు.. రాముడు..!

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:04 PM IST
సీతని అపహరించింది రావణుడు కాదు.. రాముడు..!
పాఠ్యపుస్తకంలోని 106వ పేజీలో కనిపించిన తప్పు
  • News18
  • Last Updated: June 6, 2018, 3:04 PM IST
  • Share this:
మనలో చాలా మంది రామాయణం గురించి విన్నాం. మనం విన్నది... కథల్లో చదివినది.. సినిమాల్లో చూసిన దాని బట్టి.. సీతను
రావణాసురుడు అపహరించాడని తెలుసు. ఏ చిన్నపిల్లగాడిని అడిగినా ఇదే చెబుతారు. బిక్షాగాడి వేషధారణలో వచ్చిన రావణుడు.. సీతను

అపహరించి లంకకు తీసుకెళ్తాడు. కానీ గుజరాత్‌లో 12 వ తరగతి పాఠ్యపుస్తకాలు మాత్రం సీతను రాముడు అపహరించినట్లు చెబుతున్నాయి.

గుజరాత్‌లో 12వ తరగతికి చెందిన 'ఇంట్రడక్షన్ టూ సాంస్క్రిట్ లిటరేచర్' పాఠ్యపుస్తకంలో 106 పేజీలో ఈ వ్యాక్యం కనిపిస్తుంది. సంస్క్రుత
కవి కాళిదాస్ రచించిన ‘రఘువంశం' పాఠ్యాంశంలో తప్పు దొర్లింది. ‘సీతను రావణుడు అపహరించిన విషయాన్ని రాముడికి లక్ష్మణుడు చెప్పాడు' అని ఉండాల్సిన చోట .. ‘సీతను రాముడు అపహరించిన విషయాన్ని రాముడికి లక్ష్మణుడు చెప్పాడు.' అని తప్పుగా ముద్రించారు.

ఇదొక్కటే కాదు.‘ abducted’ (అపహరించడం)కు బదులు ‘abandoned’(రద్దు చేయడం) అని పలు చోట్ల పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల్లో అచ్చుతప్పుల నేపథ్యంలో గుజరాత్ స్టేట్ బోర్డు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ విద్యాశాఖ రామాయణాన్ని అవమాన పరిచిందని కొన్ని సంఘాలు మండిపడ్డాయి. ఐతే ట్రాన్స్ లేషన్ తప్పిదం వల్లే అలాజరిగిందన్న అధికారులు తప్పును అంగీకరించారు. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావ్రుతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు.

కాగా, ప్రతి ఏటా ప్రభుత్వ పుస్తకాల్లో అచ్చు తప్పులు దొర్లుతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని... ప్రతిసారీ చేసిన తప్పులనే మళ్లీ పునరావ్రుతం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 1, 2018, 8:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading