హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం..ధ్వంసమైన ఇంజన్ ముందు భాగం

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం..ధ్వంసమైన ఇంజన్ ముందు భాగం

వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం..ధ్వంసమైన ఇంజన్ ముందు భాగం

వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం..ధ్వంసమైన ఇంజన్ ముందు భాగం

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ రైలు గాంధీనగర్- ముంబైకి రాకపోకలు సాగిస్తుంటుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Gujarat, India

  ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) ప్రమాదానికి గురైంది. ఈ రైలు గాంధీనగర్- ముంబైకి రాకపోకలు సాగిస్తుంటుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తుంది. కానీ ప్రమాద సమయంలో 100 కిలోమీటర్ల వేగంతోనే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. గుజరాత్ నుండి గాంధీనగర్ కు వచ్చే క్రమంలో వాత్వా స్టేషన్ వద్దకు రాగానే గేదెల గుంపు అడ్డు వచ్చింది. ఈ క్రమంలో లోకల్ పైలట్ సడెన్ బ్రేక్ వేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గేదెల మందను ఢీకొట్టడంతో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఇంజన్ ముందుభాగం తుక్కు తుక్కయింది.  ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు మృతి చెందాయి. ఈ ప్రమాదం ఉదయం 11.15 గంటల సమయానికి జరిగినట్లు తెలుస్తుంది.

  అక్టోబర్ 30న ప్రారంభం

  వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) సెప్టెంబర్ 30న ప్రారంభించారు. 16 కోచ్ లు ఉన్న ఈ రైలులో 1,128 మంది ప్యాసింజర్లు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ హై స్పీడ్ రైలు అత్యాధునిక ప్రమాణాలతో రూపొందించారు. ఈ రైలులో ప్రయాణించేటప్పుడు అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు. ఈ రైలు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా కవచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి అనుసంధానించారు. కానీ ఇది రైళ్ల వరకే పని చేస్తుందని, పట్టాలపై ఏదైనా ఉంటే మాత్రం ఈ పరిజ్ఙానం ఉపయోగపడదని తెలుస్తుంది.

  నాణ్యతపై విమర్శలు

  వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express)  ప్రమాదంపై ప్యాసింజర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రైలు గరిష్ట స్పీడ్ 180 కిలోమీటర్లు. కాగా ప్రమాద సమయంలో కేవలం 100 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. ఈ స్పీడ్ కీ ఇంజన్ ముందు భాగం దెబ్బతినడంపై విమర్శలు చేస్తున్నారు. రైలు ఇంజన్ నాణ్యతపై పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రారంభించిన 15 రోజులకే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

  ఇక 2019లో ఢిల్లీ-వారణాసి మధ్య తొలి రైలు ప్రారంభం అయింది. వచ్చే మూడేళ్ళలో 400  రైళ్లను తీసుకురావడమే టార్గెట్ గా కేంద్రం పెట్టుకుంది.  అయితే మేకిన్ ఇండియాలో భాగంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టగా..ఇక తరువాత బుల్లెట్ ట్రైన్ లను ప్రవేశపెట్టడమే ద్యేయంగా అడుగులు వేయాలని భావించింది. కానీ వందే భారత్ విషయంలో ఇలా జరగడంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

  Published by:Rajashekar Konda
  First published:

  ఉత్తమ కథలు