హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mission Paani | భారతదేశంలో తాగునీరు ఎంతమందికి అందుబాటులో ఉందో తెలుసా..?

Mission Paani | భారతదేశంలో తాగునీరు ఎంతమందికి అందుబాటులో ఉందో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mission Paani | ఇప్పటికీ దేశంలోని చాలా మారుమూల గ్రామాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. అయితే, నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిలో వృథా చేసుకుంటూ పోతే భవిష్యత్​లో ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు.

ప్రపంచంలోని మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. అయితే, కొన్నేళ్లుగా నీటి కొరత అధికం అవుతోంది. ఇందుకు ముఖ్య కారణం నీటి వృథా అని చెప్పక తప్పదు. నీరు ఉన్న వారు ఇష్టారీతిగా వృథా చేస్తుంటూ పోతుంటే.. లేని వారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ దేశంలోని చాలా మారుమూల గ్రామాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. అయితే, నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిలో వృథా చేసుకుంటూ పోతే భవిష్యత్​లో ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. మన దేశంలో 130 కోట్ల మంది ప్రజలకు మొత్తం నీటిలో కేవలం 4% మాత్రమే త్రాగడానికి పనికొస్తుంది. ఇక, మన దేశంలో 44 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందని యూనిసెఫ్ చేసిన అధ్యయనంలో తేలింది .సురక్షితమైన నీరు త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం చేయడంతో పాటు మెరుగైన పారిశుద్యం, పరిశుభ్రతను సాధించవచ్చు. సరైన పారిశుధ్యం లేకపోవడం, అపరిశుభ్రత, అసురక్షిత నీరు త్రాగడం వల్ల ఏటా అనేక మంది వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు.

అయితే, గత కొన్నేళ్లుగా భారత్ లో సురక్షితమైన తాగునీరు శాతం పెరుగుతోంది. జలజీవన్ పథకం ద్వారా ఈ ప్రగతి సాధ్యమైంది. ఈ పథకం ద్వారా నవంబర్ 4 2021 వరకు.. దాదాపు 8.45 కోట్ల మందికి నల్లా కలెక్షన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించబడింది. ఈ మిషన్ కింద ఆరు రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు 100 శాతం నల్లా కలెక్షన్లు సాధించి.. సురక్షితమైన తాగునీరును పొందుతున్నాయ్. గోవా, తెలగాణ, హర్యానా, దాద్రా హవేలీ నగర్, అండమాన్ నికోబర్ ఐల్యాండ్స్ మరియు పుదిచ్చేరిల్లో ఈ ప్రగతి మనకు కన్పిస్తోంది.

ఇక, NFHS-4 (2015-16) డేటాతో పోలీస్తే .. రీసెంట్ గా విడుదల చేసిన NFHS-5 (2019-2020) డేటా ప్రకారం 22 రాష్ట్రాల్లో తాగునీరు అందించే విషయంలో పురోగతి కన్పించింది. ఇదంతా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలే వల్ల సాధ్యమైంది.

ఇక, భూగర్భ జలాల్ని వాడకంలో భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే, వాటర్ క్వాలిటీ విషయంలో 122 దేశాల్లో మన దేశం 120 వస్థానంలో ఉంది. భూగర్భ జలాలు క్షీణించడం, వనరులు కలుషితం కావడం మరియు వృద్ధాప్య సరఫరా మౌలిక సదుపాయాలు భారతదేశంలో సురక్షితమైన తాగునీటిని పొందే విషయంలో పరిస్థితిని మరింత దిగజార్చాయి. భారతదేశంలోని ప్రధాన నీటి వనరులలో ఒకటైన నదులు కూడా వేగంగా పెరుగుతున్న జనాభా, అధిక పారిశ్రామికీకరణ మరియు కాలుష్యం కారణంగా తగ్గిపోతున్నాయి లేదా కలుషితమవుతున్నాయి.

దేశంలోని ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2020 డిసెంబర్ 23న జల్ జీవన్ మిషన్ ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 2.90 లక్షల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, ఈ కార్యక్రమాలన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2024 కల్లా ఈ మిషన్ ను అన్ని రాష్ట్రాలకు యుద్ద ప్రాతిపదికన అమలు చేయాలని భావిస్తోంది. ఇక దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 12.4 శాతం రూరల్ గ్రామాలకు నల్లా నీరు అందుతోంది. అలాగే కరువు ప్రాంతమైన రాజస్తాన్ లో కూడా 20.91 శాతం అమలు అయింది. అలాగే వివిధ రాష్ట్రాలైనా అస్సాం (22%), లఢఖ్ (16.62%), జార్ఖండ్ (15.16%), పశ్చిమ బెంగాల్ (13.48%) మరియు ఛత్తీస్ ఘర్ ల్లో (13.23%) జలజీవన్ పథకం కింద నీరు అందిస్తోంది కేంద్రం.

అయితే, మనదేశంలో పట్టణ ప్రాంతాలు, ప్రత్యేకించి నగరాల్లోని మురికివాడలు మరియు అనధికార కాలనీలు కూడా నీటి సంక్షోభం యొక్క తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2020లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) విడుదల చేసిన నివేదిక జనాభాలో వేగంగా పెరుగుతున్న కారణంగా 2050 నాటికి దాదాపు 30 భారతదేశ నగరాలు తీవ్ర నీటి ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని అంచనా వేసింది. ఢిల్లీ ప్రభుత్వం చేసిన తాజా సర్వేలో దాదాపు 44% మంది ఢిల్లీ మురికివాడల నివాసితులు ప్రధానంగా తాగడానికి బాటిల్ వాటర్‌పై ఆధారపడుతున్నారని తేలింది.

మిషన్ పానీ, న్యూస్ 18 మరియు హార్పిక్ ఇండియాల చొరవ, ప్రతి భారతీయుడికి సురక్షితమైన మంచినీటిని పొందేలా ప్రయత్నాలను విస్తరించడం మరియు ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మీరు కూడా ఈ ప్రచారంలో భాగమై   మిషన్ పానీ  కార్యక్రమంలో పొల్గొనవచ్చు

First published:

Tags: Drinking water, Mission paani, News18, Save water, Water Crisis

ఉత్తమ కథలు