పాకిస్తాన్‌కు షాక్..భారత్‌కు మరో దేశం మద్దతు

కశ్మీర్ అంశంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు వివరించిన మరుసటి రోజే ఆ దేశ విదేశాంగశాఖ ఈ ప్రకటన చేసింది.

news18-telugu
Updated: August 21, 2019, 6:59 PM IST
పాకిస్తాన్‌కు షాక్..భారత్‌కు మరో దేశం మద్దతు
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మ్యాప్
  • Share this:
ఆర్టికల్ 370 రద్దుపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. దీన్ని బూచిగా చూపి భారత్‌పై విషం చిమ్మేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఐతే పాక్‌కు ఏ దేశమూ మద్దతివ్వడం లేదు. తాజాగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ సైతం భారత్‌కే మద్దతు ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత వ్యవహారమని స్పష్టంచేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగమంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ అంశంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు వివరించిన మరుసటి రోజే ఆ దేశ విదేశాంగశాఖ ఈ ప్రకటన చేసింది.

ఆర్టికల్ 370 రద్దును భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారంగా బంగ్లాదేశ్ పరిగణిస్తోంది. ప్రాంతీయ సుస్థిరత, శాంతిని నెలకొల్పుట, అన్ని దేశాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది.
బంగ్లాదేశ్ విదేశాంగశాఖ
కాగా, ఆర్టికల్ 370పై యూఎస్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు భారత్‌కు మొగ్గుచూపాయి. అది ద్వైపాక్షిక అంశమంటూ పాకిస్తాన్‌కు షాకిస్తున్నాయి. దాంతో ఏం చేయాలో తెలియక భారత్‌పై అడ్డమైన ఆరోపణలు చేస్తోంది పాక్.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు