కరోనా రెండో వేవ్ కు భిన్నంగా ప్రస్తుత మూడో వేవ్ లో ఆస్పత్రుల్లో చేరికలు పెద్దగా లేవనేది ఇన్నాళ్లూ ఊరట కలిగించింది. కానీ ఇప్పుడు కొవిడ్ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, మొత్తంగా దేశంలో కొవిడ్ పరిస్థితి మారబోతోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం నాటి లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 1.8లక్షల కొత్త కేసులు, 146 మరణాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో కొవిడ్ మూడో వేవ ఈనెలాఖరుకు అత్యున్నత దశకు చేరుతుందనే అంచనాలున్నాయి. కరోనా రెండో వేవ్ కు భిన్నంగా ప్రస్తుత మూడో వేవ్ లో ఆస్పత్రుల్లో చేరికలు పెద్దగా లేవనేది ఇన్నాళ్లూ ఊరట కలిగించింది. కానీ ఇప్పుడు కొవిడ్ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, మొత్తంగా దేశంలో కొవిడ్ పరిస్థితి మారబోతోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో ఆస్పత్రుల్లో చేరికలు పెరగనున్నందున ఆ మేరకు అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం సూచనలు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈ మేరకు సోమవారం మీడియా సమావేశంలో వివరాలు చెప్పారు..
కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ప్రస్తుతానికి కొవిడ్ బాధితుల ఆస్పత్రి చేరికలు 5 నుంచి 10 శాతంగా ఉన్నాయని, కరోనా విలయం ఇంకా కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో ఆస్పత్రి చేరికలు వేగంగా పెరుగుతాయని, కరోనా పరిస్థితి వేగంగా మారే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో అవసరమైన బెడ్లు, వైద్య సిబ్బంది, ఆక్సిజన్ నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
పది రోజుల కిందట దేశంలో రోజువారీ కేసులు 10 వేల నుంచి 15 వేల వరకు ఉండేవి. కానీ ఆదివారం ఒక్కరోజే కొత్త కేసులు 1.79లక్షలుగా వచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గత రెండు వేవ్ ల మాదిరిగానే మూడో వేవ్ కూడా మెట్రో నగరాల్లో ఆందోళనకరంగా ఉందని, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్ కతా సిటీల్ల రోజువారీ కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ శాతం ఎక్కువగా ఉంటోందని కేంద్రం గుర్తుచేసింది.
‘దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతున్నాయి. ఆందోళనకర ఒమిక్రాన్ వల్లే ఈ పెరుగుదల ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి గరిష్టంగా 10 శాతం బాధితులే ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ రాబోయే రోజుల్లో ఆస్పత్రి చేరికలు పెరుగుతాయి. అందుకే అన్ని రాష్ట్రాలు ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ల సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలి’అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.