హోమ్ /వార్తలు /జాతీయం /

#Gunslinger : అభినందన్ మీసానికి దేశం ఫిదా.. క్రేజీగా ఫీలవుతున్న యూత్

#Gunslinger : అభినందన్ మీసానికి దేశం ఫిదా.. క్రేజీగా ఫీలవుతున్న యూత్

అభినందన్ వర్థమాన్

అభినందన్ వర్థమాన్

సోషల్ మీడియాలో అభినందన్ మీసం ఇప్పుడో క్రేజీ ట్రెండింగ్‌గా మారిపోయింది. 'గన్‌స్లింగర్'గా పిలిచే ఆ తరహా మీసం కట్టును మేమూ ట్రై చేస్తామని సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

  సినిమా హీరోలు ఏదైనా కొత్త రకం స్టైల్ ఫాలో అయితే చాలు.. యూత్ అంతా విరగబడి దాన్నే ఫాలో అవుతుంటారు. తెలుగులో విజయ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి విడుదలయ్యాక.. చాలామంది యువత ఆ తరహా గడ్డం పెంచుకుని మురిసిపోయారు. సినిమా హీరోల సంగతి పక్కనపెడితే.. ఇప్పుడో రియల్ హీరో స్టైల్‌ను ఫాలో అవడానికి సిద్దమైపోతున్నారు యూత్. ఇంతకీ ఎవరా రియల్ హీరో అనుకుంటున్నారా..! ఆయనే అభినందన్ వర్థమాన్.


  పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ 'మీసం' కట్టుకు యువత ఫిదా అయిపోతున్నారు. అభినందన్ ధైర్య సాహసాలకు తగ్గట్టే ఆయన ఆహార్యం కూడా వీరత్వానికి ప్రతీకగా ఉందని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో అభినందన్ మీసం ఇప్పుడో క్రేజీ ట్రెండింగ్‌గా మారిపోయింది. 'గన్‌స్లింగర్'గా పిలిచే ఆ తరహా మీసం కట్టును మేమూ ట్రై చేస్తామని సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కొమ్ములు తిరిగినట్టున్న కోరమీసంతో అభినందన్ యువతకు ఇప్పుడో ఫ్యాషన్ ఐకాన్‌ గానూ మారిపోయాడనే చెప్పాలి.


  అభినందన్ వర్థమాన్ రాకతో యావత్ భారతం పులకించిపోయింది. మూడు రోజులుగా 'అభినందన్' కోసం ఆత్రుతగా ఎదురుచూసిన భారతీయులు శుక్రవారం రాత్రి ఆయన దేశంలో అడుగుపెట్టగానే సంబరాలు జరుపుకున్నారు. వీరుడికి సలాం అంటూ సెల్యూట్ కొట్టారు. ప్రస్తుతం కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం అధికారులు ఆయన్ను ఢిల్లీలోనే ఉంచారు.

  First published:

  Tags: Abhinandan Varthaman, India VS Pakistan, Jammu and Kashmir, Kashmir security

  ఉత్తమ కథలు