• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • ABHI TOH SURAJ UGA HAI PM NARDENDRA MODI WRITES POEM ON NEW YEAR 2021 BA

PM Modi New Year 2021 Poem: కొత్త ఏడాది వేళ ప్రధాని నరేంద్ర మోదీ పద్యం.. ‘ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు’

PM Modi New Year 2021 Poem: కొత్త ఏడాది వేళ ప్రధాని నరేంద్ర మోదీ పద్యం.. ‘ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు’

ప్రధాని నరేంద్ర మోదీ

‘ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు’ అనే టైటిల్‌తో ఉన్న ఈ పద్యం వీడియో మొత్తం 1.37 నిమిషాల నిడివి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ పద్యాన్ని చదివి వినిపించారు. ఆయన చెబుతున్న పద్య పదాలకు అనుగుణంగా వీడియోను ఎడిట్ చేశారు.

  • Share this:
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పద్యం రాశారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఆయన ఓ అద్భుతమైన, స్ఫూర్తివంతమైన పద్యాన్ని రాశారు. ఈ పద్యాన్ని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు’ అనే టైటిల్‌తో ఉన్న ఈ పద్యం వీడియో మొత్తం 1.37 నిమిషాల నిడివి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ పద్యాన్ని చదివి వినిపించారు. ఆయన చెబుతున్న పద్య పదాలకు అనుగుణంగా వీడియోను ఎడిట్ చేశారు. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు రాకెట్ ప్రయోగాలు, రాఫెల్ జెట్లు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, రైతులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, త్రివిధ దళాలకు సబంధించిన దృశ్యాలు ఉన్నాయి. 2020లో జనం ఎదుర్కొన్న కష్ట నష్టాలను అధిగమించేలా ఇప్పుడే సూర్యుడు ఉదయించాడనే భావన వచ్చేలా మోదీ పద్యం రాశారు. మరోవైపు న్యూ ఇయర్ వేళ ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

    హ్యాపీ న్యూ ఇయర్ 2021. ఈ ఏడాది మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, సౌభాగ్యం కలిగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కొత్త ఏడాదిలో మొదటి రోజు ప్రధాని మోదీ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆరు నగరాల్లో మోడల్ హౌసింగ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిని లైట్ హౌస్ ప్రాజెక్టులుగా పిలుస్తారు. ఈ ప్రాజెక్టులను ఇండోర్, రాజ్ కోట్, చెన్నై, రాంచీ, అగర్తలా, లక్నోలో నిర్మిస్తారు. ఒక్కో ప్రాంతంలో సుమారు 1000 ఇళ్లు నిర్మిస్తారు. వారికి సంబంధించిన వసతులు కూడా ఏర్పాటు చేస్తారు.



    మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. హౌసింగ్ ప్రాజెక్టులపై సమీక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అందరికంటే మిన్నగా అమలు చేస్తున్న రాష్ట్రాలను అభినందించారు. ఏపీలో కూడా పీఎం ఆవాస్ యోజన పథకాన్ని  మెరుగ్గా అమలు చేస్తున్నారని ప్రధాని మోదీ కితాబిచ్చారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: