హోమ్ /వార్తలు /జాతీయం /

కేజ్రీవాల్‌ని చెంపపై కొట్టడానికి అసలు కారణం ఇదీ... పోలీసులు ఏమన్నారంటే...

కేజ్రీవాల్‌ని చెంపపై కొట్టడానికి అసలు కారణం ఇదీ... పోలీసులు ఏమన్నారంటే...

కేజ్రీవాల్‌ను కొట్టేందుకు వచ్చిన కార్యకర్త

కేజ్రీవాల్‌ను కొట్టేందుకు వచ్చిన కార్యకర్త

AAP Arvind Kejriwal Slapped : 33 ఏళ్ల ఆ యువకుణ్ని సురేష్‌గా గుర్తించారు. స్థానికంగా తుక్కును తరలించే డీలర్. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మోతీనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టైంలో ఓ వ్యక్తి హఠాత్తుగా దాడి చేశాడు. ఓపెన్ టాప్ జీపులో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లిన ఆ యువకుడు ఆయన చెంపపై కొట్టాడు. ఆప్ కార్యకర్తలు షాకయ్యారు. కేజ్రీవాల్‌పై దాడి చేసిన వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అసలెందుకు దాడి చేశాడన్నది ప్రశ్నగా మిగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి చెంది, విసుగొచ్చి... ఆ కోపంతో కేజ్రీవాల్‌పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. 33 ఏళ్ల ఆ యువకుణ్ని సురేష్‌గా గుర్తించారు. స్థానికంగా తుక్కును తరలించే డీలర్. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారు. పార్టీ సమావేశాలు, ర్యాలీలకు నిర్వాహకుడిగా కూడా పనిచేశాడు. అందువల్లే అతను కేజ్రీవాల్‌ని అంత ఈజీగా చేరగలిగాడని తెలిసింది.


నిజానికి కేజ్రీవాల్ చెంపపై కొట్టినందుకు అక్కడే ఉన్న ఆప్ కార్యకర్తలు అతన్ని్ చితకబాదే వాళ్లే. అలర్టైన పోలీసులు వెంటనే అతన్ని పక్కకి లాగి, ఆస్పత్రికి తరలించారు. అతను ఆప్ కార్యకర్త కాదనీ, మోదీ భక్తుడని అతని భార్యే చెబుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అతను దాడి చేసేందుకు పోలీసులు వీలు కల్పించారని అంటున్నారు. చిత్రమేంటంటే... ఈ కేసులో పోలీసులు ఎలాంటి FIR నమోదు చెయ్యలేదు. ఎందుకంటే ఎవరూ సురేష్‌కి వ్యతిరేకంగా కేసు పెట్టలేదు. దాన్ని బట్టీ చూస్తే... అతను ఆప్ కార్యకర్తే కావచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి.


 


ఇవి కూడా చదవండి :


తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి... రేపటి తొలి దశ పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధం...

Top 10 on Instagram : ఇన్‌స్టాగ్రాంలో టాప్ టెన్ అకౌంట్స్ ఇవే...


చంద్రబాబుకి జగన్ ఇవ్వాలనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్ అదేనా... వాటే స్కెచ్...


టీడీపీ ఓడితే ఏపీలో మళ్లీ ఎన్నికలు... చంద్రబాబు వ్యూహం అదేనా... భయపెడుతున్న 20 సర్వేలు...

First published:

Tags: AAP, Arvind Kejriwal, Delhi, Delhi Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019

ఉత్తమ కథలు