దుమ్ము రేపుతున్న లగే రహో కేజ్రీవాల్ సాంగ్... ఢిల్లీలో ఆప్ మళ్లీ గెలుస్తుందా?

చలికాలంలో ఢిల్లీ వేడెక్కుతోంది. రాజకీయం రంజుగా సాగుతోంది. మరోసారి ఢిల్లీ సీఎంగా గద్దెనెక్కేందుకు కేజ్రీవాల్ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారా?

news18-telugu
Updated: January 12, 2020, 7:21 AM IST
దుమ్ము రేపుతున్న లగే రహో కేజ్రీవాల్ సాంగ్... ఢిల్లీలో ఆప్ మళ్లీ గెలుస్తుందా?
దుమ్ము రేపుతున్న లగే రహో కేజ్రీవాల్... ఢిల్లీలో ఆప్ మళ్లీ గెలుస్తుందా? (credit - YT - Aam Aadmi Party)
  • Share this:
దేశంలోని చాలా రాష్ట్రాల్లో తన గాలి వీచేలా చేసుకున్న బీజేపీకి... రాజధాని ఢిల్లీలో మాత్రం ఛాన్స్ లేకుండా చేసింది కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీకి ఐదేళ్లు సీఎంగా కొనసాగిన కేజ్రీవాల్... ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలవ్వడంతో... మరోసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు ఏం చెయ్యాలో అన్నీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అందులో భాగంగా... "లగే రహో కేజ్రీవాల్" అనే సాంగ్‌ను శనివారం సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇప్పుడా సాంగ్ వైరల్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ లగే రహో కేజ్రీవాల్ అని హమ్ చేసేస్తున్నారు. "లగే రహో మున్నాభాయ్" థీమ్‌తో ఈ సాంగ్‌ను రూపొందించారు. ఇందులో కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారం, వివిధ సందర్భాల్లో కేజ్రీవాల్ చేసిన పనులు అన్నింటినీ చూపించడం ద్వారా... ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి క్రేజ్ పెరిగేలా చేస్తున్నారు.

‘లగే రహో కేజ్రీవాల్’ పాటను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ శిశోడియా రిలీజ్ చేశారు. 2 నిమిషాల 52 సెకండ్లు ఉన్న ఈ పాటను బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ రూపొందించారు. ‘‘అచ్ఛే బీతే పాంచ్ సాల్, లగే రహో కేజ్రీవాల్’’ అనే నినాదంతో ఎన్నికలు నిర్వహిస్తోంది ఆప్. ఈ ఐదేళ్లూ... కేజ్రీవాల్ అద్భుతంగా పరిపాలించకపోయినా... ఎబౌ యావరేజ్ టాక్ తెచ్చుకున్నారు. అందువల్ల మరోసారి ఆప్ గెలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఐతే... ఇదివరకట్లా... 70 అసెంబ్లీ సీట్లలో 67 సీట్లు ఆప్‌కి రాకపోవచ్చనీ... అయినప్పటికీ... కేజ్రీవాల్‌కి మరోసారి ఛాన్స్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీ... లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలుండగా... ఏడింటినీ గెలుచుకుంది. అందువల్ల ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. ఐతే... ఢిల్లీ ఓటర్లు... లోక్‌సభ ఎన్నికలకూ, అసెంబ్లీ ఎన్నికలకూ సంబంధం లేకుండా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ పరిపాలన వరకూ కేజ్రీవాల్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 54.3 శాతం ఓట్లు గెలుచుకోగా... బీజేపీ 32.3 శాతం... కాంగ్రెస్ 9.7 శాతం ఓట్లు సాధించాయి.

First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు