దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఆప్ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ (Rajendra Pal Gautam) హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు రాజకీయాంగా వేడినీ రాజేశాయి. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా, ఢిల్లీ సాంఘిక సంక్షేమ మంత్రి శుక్రవారం వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో (religious conversion event) పాల్గొని అక్టోబరు 5న వందలాది మంది హిందువులూ బౌద్ధంలోకి మారతారని, హిందు దేవతలను దేవుళ్లుగా పరిగణించబోమని ప్రతిజ్ఞ చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన వీడియో వైరల్ కావడంతో రచ్చగా మారింది.దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ నిరసనలకు దిగింది. గౌతమ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి సమాజంపై ఉన్న ద్వేషాన్ని హైలైట్ చేస్తున్నాయని నేతలు విమర్శించారు. ఈ సంఘటన తర్వాత, రాజేంద్ర పాల్ గౌతమ్‌ను బర్తరఫ్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బిజెపి దాడి చేసింది. ఆప్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి రాజేంద్రపాల్ తన పదవికి రాజీనామా (resigned) చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
आज महर्षि वाल्मीकि जी का प्रकटोत्सव दिवस है एवं दूसरी ओर मान्यवर कांशीराम साहेब की पुण्यतिथि भी है। ऐसे संयोग में आज मैं कई बंधनों से मुक्त हुआ और आज मेरा नया जन्म हुआ है। अब मैं और अधिक मज़बूती से समाज पर होने वाले अत्याचारों व अधिकारों की लड़ाई को बिना किसी बंधन के जारी रखूँगा pic.twitter.com/buwnHYVgG8
— Rajendra Pal Gautam (@AdvRajendraPal) October 9, 2022
ఈ క్రమంలో ఆయన.. తన ట్విటర్ వేదికగా.. "ఈ రోజు మహర్షి వాల్మీకి జీ యొక్క అభివ్యక్తి దినం, మరోవైపు, ఇది మాన్యవర్ కాన్షీ రామ్ సాహెబ్ వర్ధంతి కూడా, అలాంటి యాదృచ్ఛికంగా, ఈ రోజు నేను అనేక సంకెళ్ళ నుండి విముక్తి పొందాను. ఇప్పుడు నేను ఎలాంటి ఆంక్షలు లేకుండా మరింత దృఢంగా సమాజంపై హక్కులు, దౌర్జన్యాల కోసం పోరాడుతూనే ఉంటానంటూ ట్విట్ ను చేశారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాలలో భారీ వర్షంలో హీట్ ను పుట్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AAP, Aravind Kejriwal, Delhi