హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

AAP : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆప్.. గుజరాత్‌లో ప్రధాన ప్రతిపక్షం అవుతుందా?

AAP : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆప్.. గుజరాత్‌లో ప్రధాన ప్రతిపక్షం అవుతుందా?

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆప్

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆప్

Gujarat Election Results : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అంచనాలను అందుకోలేకపోయినా.. ఈ ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. దీని వెనక పెద్ద విశ్లేషణే ఉంది. అదేంటో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Gujarat Election Results : భారతదేశంలో.. ఇప్పటివరకూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉండేది. తమకు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఇన్నాళ్లూ కాంగ్రెస్‌నే చూసింది. కానీ గత ఐదేళ్లుగా.. ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించేందుకూ, తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ ఢిల్లీలో రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న ఆప్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటి.. ఢిల్లీ తమదే అని నిరూపించుకుంది. అలాగే.. పక్కనే ఉన్న పంజాబ్ లో కూడా అధికారాన్ని చేపట్టి.. రెండు చోట్ల పార్టీని అధికారంలో ఉండటంలో సూపర్ సక్సెస్ అయ్యారు ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఇప్పుడు గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా నామమాత్రంగానైనా ఆ పార్టీ ప్రభావం చూపగలిగింది.

నిజానికి గుజరాత్‌లో ఆప్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అక్కడ ఆ పార్టీ అధికారంలోకి రాదని అందరికీ తెలుసు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తలే లేరు. అయినప్పటికీ కేజ్రీవాల్ ఎంతో దూకుడు చూపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఢీ అంటే ఢీ అన్నారు. గుజరాత్ గడ్డపై జోరుగా ప్రచారం చేశారు. ఈ ప్రయత్నాల వల్ల కనీసం ఆరేడు స్థానాలైనా ఆ పార్టీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటోంది. గుజరాత్‌లో 14 శాతానికి పైగా ఓట్లు సాధించింది. అలాగే.. హిమాచల్ ప్రదేశ్‌లో 6 శాతానికి పైగా సాధిస్తే.. తమది జాతీయ పార్టీగా అవతరిస్తుందని ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా తెలిపారు

ఓవైపు కాంగ్రెస్ బలహీనపడుతోంది. 2019 ఎన్నికల తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైంది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ విజయం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ మధ్య ఊగిసలాడుతోంది. కొత్త అధ్యక్షుడైన మల్లికార్జున కర్గే కూడా అంత దూకుడుగా లేరు. యువనేతగా ఉన్న రాహుల్ గాంధీ.. తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో కూడా ప్రచారం చెయ్యకుండా.. భారత్ జోడో యాత్రలో తలమునకలయ్యారు. ఆయన ప్రచారం చేసి ఉంటే.. కాంగ్రెస్‌కి కొంతైనా ప్లస్ అయ్యేదనే వాదన ఉంది.

ఇది కూడా చదవండి : Gujarat Results : గుజరాత్ ఫలితాలతో దేశంలో వచ్చే మార్పులేంటి?

కాంగ్రెస్‌లో ఉన్న లోటును కేజ్రీవాల్ బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. వీలైన ప్రతి చోటా పార్టీని విస్తరిస్తున్నారు. భవిష్యత్తులో గుజరాత్‌లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లోనూ ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆప్‌పై కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఆ పార్టీ పట్ల ప్రజల్లో క్లీన్ ఇమేజ్ ఉందనీ.. అది ఆయా రాష్ట్రాల ఫలితాల్లో కనిపిస్తోందని అంటున్నారు.

First published:

Tags: Gujarat Assembly Elections 2022

ఉత్తమ కథలు