హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

AAP in Trouble Again : కేజ్రీవాల్ కు కొత్త తలనొప్పి..మరో స్కామ్ పై సీబీఐ విచారణ!

AAP in Trouble Again : కేజ్రీవాల్ కు కొత్త తలనొప్పి..మరో స్కామ్ పై సీబీఐ విచారణ!

కేజ్రీవాల్ చుట్టూ సీబీఐ ఉచ్చు

కేజ్రీవాల్ చుట్టూ సీబీఐ ఉచ్చు

1,000 లో-ఫ్లోర్ బస్సుల(Low-Floor Buses)కొనుగోలులో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, దీనిపై దర్యాప్తు చేపట్టాల్సి ఉందంటూ సీబీఐ అధికారులు అందజేసిన ప్రతిపాదనలపై లెప్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

AAP in Trouble Again : ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం(AAP Govt) ఇటీవల తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీలో అవీవీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ(CBI) విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మద్యం పాలసీ అంశం ఇంకా ఓ కొలిక్కిరాకముందే కేజ్రీవాల్ ప్రభుత్వంపై సీబీఐ మరో ఉచ్చు వేసింది. ఆప్ ప్రభుత్వం కొనుగోలు చేసిన లో ఫ్లోర్ బస్సుల వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వచ్చిన ఫిర్యాదుపై సీబీఐ విచారణ జరపనుంది. డీటీసీ(Delhi Transport Corporation)ద్వారా 1,000 లో ఫ్లోర్ బస్సుల కొనుగోలులో జరిగిన అవినీతిపై విచారణ జరిపేందుకు సీబీఐకి ఫిర్యాదును పంపే ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 1,000 లో-ఫ్లోర్ బస్సుల(Low-Floor Buses)కొనుగోలులో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, దీనిపై దర్యాప్తు చేపట్టాల్సి ఉందంటూ సీబీఐ అధికారులు అందజేసిన ప్రతిపాదనలపై లెప్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు.

2019లో జులైలో 1000 లో ఫ్లోర్ భారత్ స్టేజ్-4, స్టేజ్-6 బస్సులు కొనుగోలు, వాటి నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టుల ప్రక్రియ ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(డీటీసీ) ఆధ్వర్యంలో జరిగింది. అయితే బస్సులను కొనుగోలు చేయడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, దీనికి రవాణ శాఖ మంత్రిని ఛైర్మన్‌గా అపాయింట్ చేయడం సరికాదంటూ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఈ ఏడాది జూన్‌లో ఫిర్యాదులు అందాయి. ఇందులో అవినీతికి పాల్పడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.

Rahul Gandhi : తమిళనాడు అమ్మాయితో రాహుల్ కి పెళ్లి..సిగ్గుపడుతున్నకాంగ్రెస్ యువరాజు!

1000 లో ఫ్లోర్ BS-IV, BS-VI బస్సుల కోసం జూలై 2019 సేకరణ బిడ్‌లో అవకతవకలు జరిగాయని, లో ఫ్లోర్ BS-VIబస్సుల కొనుగోలు, వార్షిక నిర్వహణ ఒప్పందం కోసం మార్చి 2020లో జరిగిన మరో బిడ్‌లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ శాఖల స్పందనలు, వారి సిఫార్సులను కోరేందుకు జూలై 22న ఈ ఫిర్యాదును ప్రధాన కార్యదర్శికి పంపారు లెఫ్టినెంట్ గవర్నర్. చీఫ్ సెక్రటరీ ఆగస్టు 19న సమర్పించిన నివేదికలో కొన్ని అక్రమాలను ఎత్తి చూపారని, ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు సీబీఐకి ఆ ఫిర్యాదును పంపారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరుపుతోందని ఆ వర్గాలు తెలిపాయి. కాగా,డీటీసీ కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గతంలో అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఆరోపించగా..అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌.. విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని ఆ కమిటీ తేల్చగా.. అనిల్‌ బైజల్‌ విషయాన్ని కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది.

ఇక,లెఫ్టినెంట్ గవర్నర్ తాజా చర్యపై ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ... ఏడాది క్రితం సీబీఐ ప్రాథమిక విచారణను నమోదు చేసిందని, అయి ఏమీ కనుగొనలేకపోయిందని పేర్కొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ పై ఇటీవల కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయని, తాను ఎదుర్కొంటున్న ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకే లెఫ్టినెంట్ గవర్నర్ ఇలా ఎంక్వైరీలు చేయిస్తున్నారని భరద్వాజ్‌ అన్నారు. తమ ప్రభుత్వంపై ఇప్పటి వరకు జరిగిన అన్ని విచారణలు ఫలితం ఇవ్వలేదని తెలిపారు. ఈ బస్సులను అసలు కొనుగోలు చేయలేదని,టెండర్లు రద్దు చేయబడ్డాయని తెలిపారు. ఢిల్లీకి మరింత విద్యావంతులైన లెఫ్టినెంట్ గవర్నర్ అవసరమన్నారు. ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు దేనిపై సంతకం చేస్తున్నాడో ఎటువంటి క్లూ లేదు అని భరద్వాజ్ విమర్శించారు,

Published by:Venkaiah Naidu
First published:

Tags: AAP, Aravind Kejriwal, Buses, CBI, Delhi

ఉత్తమ కథలు