Home /News /national /

AAP CONVERNOR ARVIND KEJRIWAL ANNOUNCED 10 CANDIDATES FOR PUNJAB ASSEMBLY ELECTIONS WHICH HELD IN 2022 AK

Arvind Kejriwal: పంజాబ్‌లో ముందే సై అనేసిన కేజ్రీవాల్.. కాంగ్రెస్, బీజేపీకి పోటీగా..

ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

పంజాబ్‌పై ఫోకస్ పెంచిన కేజ్రీవాల్.. అక్కడ తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుంటారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

    వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ ఎన్నికల్లో పట్టు పెంచుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. బీజేపీ, అకాళీదళ్‌ వంటి పార్టీలు కూడా ఆ దిశగా వ్యూహరచన చేస్తున్నాయి. మరోవైపు పంజాబ్‌లో తమ ప్రాతినిథ్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో పదిమందికి అప్పుడే సీట్లు ఖరారు చేశారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. వీరిలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్ కీలకంగా మారే అవకాశం ఉందని గతంలో సర్వేలు అంచనా వేశాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే స్థాయిలో సీట్లు సాధించకపోయినా.. కింగ్ మేకర్ పాత్రను పోషించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

    ఓ వైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు, మరోవైపు కొత్త రైతు చట్టాల కారణంగా బీజేపీపై వ్యతిరేకత వంటి అంశాలు ఆప్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. వీటిని తమకు అనుకూలంగా మలుచుకుని.. అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేయాలని ఆప్ భావిస్తోంది. ఇదే క్రమంలో ఆప్ టార్గెట్‌గా కాంగ్రెస్ రాజకీయాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆప్‌కు చెందిన ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రుబీ బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం చరణ్‌‌జిత్ సింగ్ చన్నీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

    రూబీ బటిండా రూరల్ 'ఆప్' ఎమ్మెల్యేగా ఉన్నారు. మంగళవారంనాడే ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా పార్టీకి తెలియజేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామాను వెంటనే ఆ ఆమోదించాల్సిందిగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆ ట్వీట్‌లో రూబీ కోరారు. రూబీ రాజీనామాపై ఆప్ ఎమ్మెల్యే, పంజాబ్ అసెంబ్లీలో పార్టీ విపక్ష నేత హర్పాల్ సింగ్ చీమా సూటిగా స్పందించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ వచ్చే అవకాశం లేదని తెలుసుకోవడం వల్లే ఆమె పార్టీ ఫిరాయించారని అన్నారు.

    Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్.. కథ మళ్లీ మొదటికొచ్చిందా ?

    Harish Rao: హరీశ్ రావుకు మరో కీలక బాధ్యతలు.. కేసీఆర్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన..

    ఇదిలా ఉంటే పంజాబ్‌పై ఫోకస్ పెంచిన కేజ్రీవాల్.. అక్కడ తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుంటారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. గతంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆప్‌లో చేరతారని.. ఆయన ఆప్ తరపున పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఉంటారనే వార్తలు వచ్చాయి. అయితే సిద్ధూ కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ పంజాబ్ ప్రెసిడెంట్, ఎంపీ భగవంత్ మన్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: AAP, Punjab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు