Home /News /national /

AAP CONVENOR AND DELHI CHIEF MINISTER ARVIND KEJRIWAL SAYS EVERY WOMEN OF 18 YEARS WILL BE GIVEN RS 1000 AK

Kejriwal-Punjab: పంజాబ్ మహిళలకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్.. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి..

ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

ఆప్ ఇచ్చిన ఈ వాగ్దానం పంజాబ్‌లోని కోటి మందికి పైగా మహిళల జీవితాలపై ప్రభావం చూపుతుందని, ఇది తమ పార్టీకి గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉందని ఆ పార్టీ విశ్వసిస్తోంది.

    వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త హామీలను ప్రకటిస్తోంది. రెండు రోజుల పంజాబ్ పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) ... తాము పంజాబ్‌లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి మహిళా ఓటరుకు ప్రతి నెలా రూ. 1,000 అందిస్తామని తెలిపారు. పంజాబ్ (Punjab) సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని ‘నకిలీ కేజ్రీవాల్’గా అభివర్ణించారు. 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ ఇచ్చిన ఎన్నికల హామీలను ఆయన అమలు చేశారని విమర్శించారు. 400 యూనిట్ల వరకు ఉచిత కరెంటు(Electricity) ఇస్తామని చన్నీ చేసిన ప్రకటనను కేజ్రీవాల్ ప్రస్తావించారు. తాము ఏ హామీ ఇస్తే.. రెండు రోజుల తరువాత చన్నీ ఆ హామీ ఇస్తున్నారని విమర్శించారు. దేశంలో వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘటన తమదే అని పరోక్షంగా తన గురించి చెప్పుకున్నారు.

    రాష్ట్రంలో అవినీతి, అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీలు గుప్పిస్తున్నా సరైన చర్యలు మాత్రం కనిపించడం లేదు. తాము 2022లో పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ప్రతి నెలా రూ. 1,000 అందజేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు, ఒక కుటుంబంలో ముగ్గురు మహిళా సభ్యులు ఉంటే, ఒక్కొక్కరికి రూ. 1000 ఇస్తామని తెలిపారు. తమ ఇంట్లోని పురుషులను కూడా ఆప్‌కు ఓటు వేసేలా మహిళలు ఒప్పించాలని కేజ్రీవాల్ సూచించారు.

    Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

    AP Capital Issue: మూడు రాజధానులపై తాత్కాలికంగా వెనక్కి తగ్గిన సీఎం జగన్.. మళ్లీ కొత్త బిల్లు వచ్చేది ఎప్పుడు.. నెక్ట్స్ ఏంటి ?

    Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

    ఆప్ ఇచ్చిన ఈ వాగ్దానం పంజాబ్‌లోని కోటి మందికి పైగా మహిళల జీవితాలపై ప్రభావం చూపుతుందని, ఇది తమ పార్టీకి గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉందని ఆ పార్టీ విశ్వసిస్తోంది. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం దక్కుతుందని ఆశించిన ఆప్.. కాంగ్రెస్ చేతిలో పరాభవం చవిచూసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. పంజాబ్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్.. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశాన్ని మాత్రం ప్రకటించలేదు. మొత్తం 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను ఆప్ ఇప్పటికే ప్రకటించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Arvind Kejriwal, Punjab

    తదుపరి వార్తలు