ప్రధాన మంత్రి కిసాన్ పథకానికి ఆధార్ తప్పనిసరి... మొదటిసారి మినహాయింపు

చిన్న, సన్నకారు రైతులను గుర్తించి పేరు, లింగం, వయస్సు, కులం, ఆధార్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్లతో లబ్ధిదారుల జాబితా రూపొందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్ర ప్రభుత్వం.

news18-telugu
Updated: February 5, 2019, 7:17 AM IST
ప్రధాన మంత్రి కిసాన్ పథకానికి ఆధార్ తప్పనిసరి... మొదటిసారి మినహాయింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి... దేశంలోని రైతులకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. గత వారం బడ్జెట్‌ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 మూడు వాయిదాల్లో చెల్లిస్తామని, మొదటి వాయిదా రూ.2,000 త్వరలో ఇస్తామని ప్రకటించారు. అయితే మొదటి వాయిదా తీసుకునేందుకు రైతులకు ఆధార్ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత వాయిదాలు తీసుకోవాలంటే మాత్రం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-Kisan) పథకంలో భాగంగా డిసెంబర్ 2018-మార్చి 2019 కాలానికి మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ ఈ ఏడాది మార్చిలో రైతుల ఖాతాల్లో జమ కానుంది.

మొదటి వాయిదా కోసం ఆధార్ నెంబర్‌తో వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు లేనివాళ్లు డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డు లేదా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి మొదటి వాయిదా పొందొచ్చు. ఆ తర్వాత వాయిదాల కోసం అర్హులైన రైతులను గుర్తించేందుకు ఆధార్ నెంబర్ తప్పనిసరి.

రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాసిన లేఖ సారాంశం


చిన్న, సన్నకారు రైతులను గుర్తించి పేరు, లింగం, వయస్సు, కులం, ఆధార్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్లతో లబ్ధిదారుల జాబితా రూపొందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. రెండు హెక్టార్లల లోపు పొలం ఉండి, దంపతులు, 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లల్ని లబ్ధిదారులుగా గుర్తించాలని సూచించింది. ఈ పథకానికి ఫిబ్రవరి 1, 2019ని కటాఫ్ డేట్‌గా నిర్ణయించింది. అంటే ఈ తేదీ తర్వాత ల్యాండ్ రికార్డ్స్ ఉంటే వచ్చే కొత్త భూ యజమాని వచ్చే ఐదేళ్ల వరకు అర్హులుకారు. అయితే పొలాన్ని వారసుల పేరు మీదకు బదలాయిస్తే ఈ పథకానికి అర్హులే. వేర్వేరు చోట్ల భూమి ఉన్నా మొత్తాన్ని కలిపే లెక్కిస్తారు.

ఇవి కూడా చదవండి:

#Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల... వివరాలివేAlert: ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో వైరస్... ఈ యాప్స్ మీ దగ్గరున్నాయా?

Photos: అక్కడికి వెళ్తే ప్యాంటు విప్పాల్సిందే... ఎందుకో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: February 5, 2019, 7:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading