ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-Kisan) పథకంలో భాగంగా ఏప్రిల్ 1న రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ను రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్‌లోకి జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. మొదటి విడతకు ఆధార్ తప్పనిసరి కాదని, ఆ తర్వాతి నుంచి రైతులు ఆధార్ ధృవీకరణ చేయాల్సి ఉంటుందని గతంలోనే కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పుడు రెండో విడతకు కూడా ఆధార్ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ విషయాన్ని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
Read this: IRCTC iPay: పేమెంట్ గేట్‌వే ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ
దేశవ్యాప్తంగా రైతులకు చేయూతనిచ్చేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-Kisan) పథకాన్ని ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2018 డిసెంబర్ నుంచే రైతులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం... ఫిబ్రవరి 24 నుంచే మొదటి వాయిదా రూ.2,000 చొప్పున 1.01 కోట్ల మంది రైతులకు రూ.2,021 కోట్లు జమ చేసింది. ఏప్రిల్ 1న రైతుల అకౌంట్‌లోకి రెండో వాయిదా రూ.2,000 జమ కానుంది. రెండో విడతకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కాదని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాతి వాయిదాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి.
Read this: ATM Rules: మీ ఏటీఎం కార్డును మీ భార్య వాడినా తప్పే... RBI రూల్స్ తెలుసుకోండి
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-Kisan) పథకానికి కేంద్రం రూ.75,000 కోట్లు కేటాయించింది. ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6,000 మూడు విడతల్లో కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది.
Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్
పవర్ బ్యాంక్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఉందా? బీమా ఎంత ముఖ్యం?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar, AADHAR, PM Kisan Scheme, Pm modi