Aadhaar New Rules: సిమ్ కార్డు కోసం ఇక ఆధార్ కార్డు వాడొచ్చు

Aadhaar New Rules: సిమ్ కార్డు పొందేందుకు, బ్యాంకులో కొత్తగా అకౌంట్ ప్రారంభించేందుకు ఇకపై ఆధార్ కార్డును ఓ ఐడీ ప్రూఫ్‌గా చూపించవచ్చు. కేంద్ర కేబినెట్ ఇటీవల చేసిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో ఇది అమలులోకి వచ్చింది.

news18-telugu
Updated: March 4, 2019, 3:54 PM IST
Aadhaar New Rules: సిమ్ కార్డు కోసం ఇక ఆధార్ కార్డు వాడొచ్చు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 4, 2019, 3:54 PM IST
కొత్త మొబైల్ సిమ్ కార్డు పొందాలన్నా...బ్యాంక్‌లో కొత్త ఆకౌంట్ తెరవాలన్నా ఇక వినియోగదారులు స్వచ్ఛందంగా ఆధార్ కార్డును అనుమతించిన ఓ ఐడీ ప్రూఫ్‌గా వినియోగించుకోవచ్చు. సిమ్ కార్డులు జారీ చేసేందుకు, బ్యాంకులో అకౌంట్ తెరిచేందుకు అనుమతి ఇస్తున్న కేవైసీ గుర్తింపు కార్డుల్లో ఇక ఆధార్ కార్డు కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.

సిమ్ కార్డు పొందేందుకు, బ్యాంక్ అకౌంట్ ప్రారంభించేందుకు ఆధార్ కార్డును ఓ ఐడీ ప్రూఫ్‌గా అనుమతించే చట్ట సవరణకు లోక్‌సభ ఆమోదం పొందింది. అయితే ఇంకా దీనికి రాజ్యసభ ఆమోదం లభించలేదు. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలంలో ముగియనుండడంతో చట్టసవరణకు రాజ్యసభ ఆమోదం లభించే అవకాశం లేదు. దీంతో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

data delete, wiping data off macbook, clean master, wiping data off iPhone, wiping data off smartphone, wiping data off laptop, data delete, data delete software, డేటా డిలీట్, డేటాను డిలీట్ చేయడం, డేటాను డిలీట్ చేయడం ఎలా?, స్మార్ట్ ఫోన్లో డేటా డిలీట్, మ్యాక్‌బుక్‌లో డేటా డిలీట్, లాప్‌టాప్‌లో డేటా డిలీట్, డేటా డిలీట్ సాఫ్ట్‌వేర్,
ప్రతీకాత్మక చిత్రం


ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించడంతో...ఇక వినియోగదారులు ఆధార్ కార్డును స్వచ్ఛందంగా గుర్తింపు కార్డుగా వినియోగించి సిమ్ కార్డును పొందచ్చు...బ్యాంకులో కొత్త ఖాతా తెరవచ్చు. ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా ఇవ్వాలా? వద్దా? అన్నది వినియోగదారుల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా తప్పనిసరిగా ఇవ్వాలని సిమ్ కార్డును జారీ చేసేందుకు సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకర్లు వినియోగదారులను డిమాండ్ చేయడానికి వీలులేదు. ఆధార్ కార్డును ప్రైవేటు సంస్థలు గుర్తింపు కార్డుగా గుర్తించకుండా నిషేధిస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది.

First published: March 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...