news18-telugu
Updated: October 7, 2020, 2:18 PM IST
ప్రతీకాత్మక చిత్రం
Aadhar for Children: ఈ రోజుల్లో ఎలాంటి అవసరం ఉన్నా, ఏ చిన్న దరఖాస్తు ఇవ్వాలన్నా ఆధార్ కార్డును అడుగుతున్నారు. పిల్లలకు స్కూల్ అడ్మిషన్ నుంచి సీనియర్ సిటిజెన్లకు పెన్షన్ కోసం ప్రతి అవసరానికి ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కరోనా లాక్డౌన్ తరువాత రాబోయే రోజుల్లో పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్కూల్లో అడ్మిషన్ తీసుకునే పిల్లలకు ఆధార్ కార్డును ముందస్తుగా సిద్ధం చేసి పెట్టుకోవడం మంచిది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం కూడా ఆధార్ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?పెద్దవాళ్ల మాదిరిగానే పిల్లలకూ ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ బిడ్డను తీసుకొని ఆధార్ కేర్ సెంటర్‌కు వెళ్లాలి. సంబంధిత ఫారంను నింపి దరఖాస్తు సమర్పించాలి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్స్ వివరాలు తీసుకోరు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో పాటు చిన్నారిని ఫోటో తీసుకుని ఒక UID క్రియేట్ చేస్తారు. దాన్ని తల్లిదండ్రుల UIDతో అనుసంధాననం చేస్తారు. ఐదు సంవత్సరాలు దాటిన తరువాత పిల్లల బయోమెట్రిక్స్ వివరాలను నమోదు చేయించుకోవచ్చు.
బయోమెట్రిక్ వివరాలు ఎప్పుడు?
పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చినప్పుడు ఒకసారి, 15 ఏళ్లు వచ్చాక మరోసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేయించాలి. ఇందుకోసం వారి వేలిముద్రలు, ఐరిస్, ఫోటోలను బయోమెట్రిక్ అప్‌గ్రేడ్ చేయించాలి. ఒరిజినల్ ఆధార్ కార్డుకు అదనంగా ఈ వివరాలను జతచేస్తారు. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేస్తారు.
అవసరమైన డాక్యుమెంట్లు..
పిల్లల ఆధార్ దరఖాస్తుకు వారి బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఫోటో గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు వివరాలు, అడ్రస్, ఐడీ ప్రూఫ్‌లు అవసరం.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 7, 2020, 2:16 PM IST