Home /News /national /

A YEAR OF PULWAMA TERROR ATTACK WHAT HAPPENED AND HOW INDIA RESPONDED NK

Pulwama Attack : పుల్వామా ఉగ్ర దాడికి ఏడాది పూర్తి... అమర సైనికులకు భారతావని నివాళి...

Pulwama Attack : పుల్వామా ఉగ్ర దాడికి ఏడాది పూర్తి... అమర సైనికులకు భారతావని నివాళి... (credit - instagram)

Pulwama Attack : పుల్వామా ఉగ్ర దాడికి ఏడాది పూర్తి... అమర సైనికులకు భారతావని నివాళి... (credit - instagram)

Pulwama Terror Attack : జమ్మూకాశ్మీర్‌... పుల్వామాలో సైనికులపై ఆత్మాహుతి దాడి జరిగి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా... అమర సైనికులకు భారత ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. సైనిక త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు.

  Pulwama Terror Attack : సరిగ్గా 2019 ఫిబ్రవరి 14న... వాలెంటైన్స్ డే నాడే... జమ్మూకాశ్మీర్‌... పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో... 40 మంది సైనికులు ప్రాణాలు విడిచారు. పక్కా ప్లాన్ ప్రకారం... భారత సైనికులే లక్ష్యంగా... ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు జైషే మహ్మద్ ఉగ్రవాదులు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై శ్రీనగర్ వైపు కాన్వాయ్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. కాశ్మీర్‌లో పుట్టి పెరిగి, పాకిస్థాన్‌లో ట్రైనింగ్ పొందిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్... శ్రీనగర్ హైవే పక్కనే ఉండే కల్వర్టు పక్క నుంచీ తన వాహనాన్ని నడిపాడు. ఆ వాహనంలో భారీగా పేలుడు పదార్థాల్ని ఉంచాడు. తన బాడీ చుట్టూ పేలుడు పదార్థాల్ని తగిలించుకున్నాడు. అవంతీపుర దగ్గర్లో తన వాహనాన్ని... సైనికుల కాన్వాయ్‌కి ఎదురుగా మళ్లించి... 78 వాహనాలున్న కాన్వాయ్‌లోని ఐదో వాహనం దగ్గరకు వెళ్లి... తనను తాను పేల్చేసుకున్నాడు. దాంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. కాన్వాయ్‌లోని ఓ వాహనం బాంబు దాడికి... గుర్తించలేని విధంగా ముక్కలైంది. అందులోని CRPF జవాన్లు... మాంసపు ముద్దలుగా తలోదిక్కుకూ ఎగిరిపడ్డారు. ఈ దాడిలో ఉగ్రవాది కూడా హతమయ్యాడు.


  ఇదివరకూ ఎప్పుడూ ఇలా జరగకపోవడంతో... సైనికులు తమకు ఎదురవ్వబోతున్న ఆపదను ముందుగా గుర్తించలేకపోయారు. పైగా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా లేవు. అదీకాక... ఉగ్రవాది కాశ్మీర్ లోయలో పుట్టి పెరిగిన వాడు కావడంతో... అతన్ని కనిపెట్టలేకపోయారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ట్రైనింగ్ పొందిన ఆదిల్ దార్... అక్కడి ఉగ్రవాదులు నూరిపోసిన జనహనన సాహిత్యాన్ని వంటబట్టించుకున్నాడు. లేనిపోని అపోహలతో భారత సైన్యంపై కక్ష పెంచుకున్నాడు. ఫలితంగా తీవ్ర దారుణం జరిగిపోయింది.  ఈ దాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఆదిల్ దార్ కుటుంబ సభ్యులు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అసలు ఆదిల్ దార్... ఉగ్రవాదుల్లో చేరినట్లు తమకు తెలియదన్నారు. చిన్నప్పటి నుంచీ లోయలోనే ఉండేవాడనీ, తనతోపాటూ బట్టలు అమ్మేందుకు అప్పుడప్పుడూ వచ్చే వాడనీ ఆదిల్ దార్ తండ్రి మీడియాకు చెప్పారు. అలాంటి ఆ కుర్రాడు... ఇలా ఉగ్రవాదం వైపు ఎందుకు మళ్లాడో తమకు తెలియదనీ, చదువులోనూ అంతగా ఆసక్తి చూపించేవాడు కాదనీ ఆయన వివరించాడు.
  View this post on Instagram

  देश के शहीदो को नमन जय हिन्द जय शहीद !! इतनी सी बात हवाओ को बताये रखना, रौशनी होगी चिरागो को जलाये रखना, लहू देकर की है जिसकी हिफाजत हमने, ऎसे तिरंगे को हमेशा अपने दिल मे बसाये रखना | देश के शहीदो को नमन जय हिन्द जय शहीद !! सैकड़ो परिंदे आसमान पर आज नज़र आने लगे, शहीदो ने दिखाई है राह उन्हें आजादी से उड़ने की | देश के शहीदो को नमन जय हिन्द जय शहीद !! . . . . . #bhartiyakanoon👨‍🎓 #pulwamaattack #soldiers #martyr #indianproudmoment #salutetosoldiers #vandematram #vandematram🇮🇳 #jaihind #bharatmatakijai


  A post shared by Satyamev Jayate 🙏 (@bhartiyakanoon) on

  పుల్వామా దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై సర్జికల్ దాడులు చేయించింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిష్టవేసిన ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులుచేసింది. ఆ దాడుల్లో బాలకోట్‌లోని జైషే మహ్మద్ స్థావరం కూడా తుత్తునియలు అయ్యింది. ఈ వైమానిక దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దాంతో... భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్‌పై యుద్ధం చేస్తామని ప్రకటించిన పాకిస్థాన్... ఆ తర్వాత ఏమీ చెయ్యలేక సైలెంటయ్యింది. ఈ విషయంలో అమెరికా సహా ప్రపంచ దేశాలు భారత్‌కి అండగా నిలిచాయి. దాంతో పాకిస్థాన్ ఆటలు సాగలేదు.
  View this post on Instagram

  Black Day for INDIA #14thfeb2019 #pulwamaattack #salutetosoldiers #neverforget


  A post shared by R.k.Sinha (@m_rounit) on

  పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వీర జవాన్లకు యావత్ భారత్ నివాళులు అర్పిస్తోంది. సోషల్ మీడియాలో ప్రజలు తమ నివాళులు అర్పిస్తున్నారు. సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు.
  View this post on Instagram

  #salutetosoldiers #indian #proudindian🇮🇳 #happyrepublicday #26january


  A post shared by Aashvi Chauhan (@aashvichauhan) on
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Pulwama Terror Attack

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు