అన్న వరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే..

ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 18 మందికి పైగా గాయపడ్డారు.

ఓ మహిళ అన్న వరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే కారణంతో నిద్రిస్తున్న భర్త గొంతు కోసి అత్యంత పాశవికంగా చంపేసింది.

  • Share this:
    సమాజంలో రోజురోజూకీ మానవీయ విలువలు మంటగలుస్తున్నాయి. వావివరసలు మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాల మోజులో సొంతవారినే మట్టుబెడుతున్నారు. అలాంటి ఘటనే తాజాగా లక్నోలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగ్రా జిల్లాలోని బర్హన్ పోలీసు స్టేషన్ పరిధి ఖంద గ్రామానికి వారం రోజుల క్రితం ఓ వ్యక్తి తన భార్య, కొడుకుతో వచ్చాడు. సదరు వ్యక్తి నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే వీరి ఇంటిపక్కనే ప్రతాప్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ప్రతాప్..రవీనకు అన్నయ్య వరుస అవుతాడు. ఈ క్రమంలో వావివరసలు మర్చిన రవీన,ప్రతాప్‌లు అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

    అయితే తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తాడనే ఉద్దేశంతో భర్తను అడ్డు తప్పించాలని రవీన భావించింది. అందుకు ప్రతాప్ సైతం సాయం చేయడంతో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో రవీన తన భర్త గొంతు కోసి అత్యంత పాశవికంగా చంపింది. సమాచారం అందుకున్న పోలీసులు రవీనను అరెస్టు చేయగా, ప్రతాప్ పారిపోయాడు. రవీనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, ప్రతాప్‌ను త్వరలోనే పట్టుకుంటామని, హత్యకు ఉపయోగించిన ఆయుధం సైతం ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు.
    Published by:Narsimha Badhini
    First published: