• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • A WOMAN POLICE OFFICER IN ODISHA HAS BEEN SUSPENDED ON CHARGES OF MAKING A PREGNANT WOMAN WALK FOR 3KM DURING HELMET CHECKING SSR

Odisha Cop: ఈ మహిళా పోలీస్ మరీ ఇలా చేసిందేంటి.. హెల్మెట్ లేదని బైక్ ఆపి.. అతని భార్య నిండు గర్భిణి అని తెలిసి కూడా..

Odisha Cop: ఈ మహిళా పోలీస్ మరీ ఇలా చేసిందేంటి.. హెల్మెట్ లేదని బైక్ ఆపి.. అతని భార్య నిండు గర్భిణి అని తెలిసి కూడా..

రీనా, బాధితురాలు

ఒడిశాలో ఓ మహిళా పోలీసు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. గిరిజనులు ఎక్కువగా ఉండే మయూర్‌బంజ్ జిల్లాలోని సరాత్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న రీనా భక్షలా చేసిన తప్పు కారణంగా సస్పెండ్ అయ్యారు. వాహనాలను తనిఖీ చేసేందుకు రోడ్డు పక్కన నిల్చున్న...

 • Share this:
  మయూర్‌బంజ్: ఒడిశాలో ఓ మహిళా పోలీసు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. గిరిజనులు ఎక్కువగా ఉండే మయూర్‌బంజ్ జిల్లాలోని సరాత్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న రీనా భక్షలా చేసిన తప్పు కారణంగా సస్పెండ్ అయ్యారు. వాహనాలను తనిఖీ చేసేందుకు రోడ్డు పక్కన నిల్చున్న రీనా.. బిక్రమ్ బరౌలి అనే వ్యక్తి.. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తన భార్యతో కలిసి బైక్‌పై వెళుతుండగా ఆపింది. హెల్మెట్ ఏదని బిక్రమ్‌ను ప్రశ్నించింది. హెల్మెట్ లేని కారణంగా ఫైన్ విధించింది. జరిమానాను ఆన్‌లైన్‌లో కడతానని బరౌలి చెప్పినా వినకుండా అతనిని, ఎనిమిది నెలల గర్భంతో ఉన్న అతని భార్యను బలవంతంగా మూడు కిలోమీటర్లు సరాత్ పోలీస్ స్టేషన్ వరకూ నడిపించింది. ఆ బైక్ తోసుకుంటూ.. తన భార్యను వెంటబెట్టుకుని బరౌలి స్టేషన్ వరకూ నడుచుకుని వెళ్లాడు. సాటి మహిళ అయి ఉండి కూడా గర్భిణిని 3 కిలోమీటర్ల పాటు నడిపించిన రీనాపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ ఎండలో మూడు కిలోమీటర్ల పాటు నడవడం వల్ల గర్భిణిగా ఉన్న బరౌలి భార్య అస్వస్థతకు గురైంది. దీంతో.. కడుపు రగిలిపోయిన బరౌలి తన భార్యతో కలిసి సదరు మహిళా పోలీసుపై సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశాడు. హెల్మెట్ లేదని జరిమానా వేయడం తప్పు కాదని, తన భార్య గర్భిణి అని తెలిసి కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిమానా కట్టాలని బలవంతం చేయడం సరికాదని బరౌలి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై విచారించిన పోలీసు ఉన్నతాధికారులు బరౌలి వాదనలో నిజం ఉందని తేల్చారు.

  రీనా తప్పు చేసిందని నిర్ధారణకొచ్చిన మయూర్‌బంజ్ ఎస్పీ స్మిత్ పర్మర్ రీనాను సస్పెండ్ చేశారు. రీనా వ్యవహార శైలిపై గతంలో కూడా ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. కానీ.. గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా మరీ ఇంత కర్కశంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేస్తే గానీ రీనాకు తెలిసొస్తుందని ఉన్నతాధికారులు భావించినట్లు సమాచారం. ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పిలుపునిస్తుంటే.. ఇలాంటి పోలీసులు మాత్రం పైశాచికంగా ప్రవర్తిస్తూ డిపార్ట్‌మెంట్‌కు చెడ్డ పేరు తెస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published: